ఫోటో బ్లాగ్: వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. అధ్యక్షుల భారత పర్యటన — 2025

29 జనవరి, 2025

వై.ఎస్‌.ఎస్./ఎస్‌.ఆర్‌.ఎఫ్. అధ్యక్షులు మరియు ఆధ్యాత్మిక అధిపతి శ్రీ శ్రీ స్వామి చిదానంద గిరి గారు భారతదేశానికి చేరుకుని, భారతదేశం మరియు నేపాల్ పర్యటనను ప్రారంభించడానికి 2025 జనవరి 28 న బెంగళూరు చేరుకున్నారని మీకు తెలియజేయడం మాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఆయనతో పాటు ఎస్‌.ఆర్‌.ఎఫ్. నుండి స్వామి సరళానంద కూడ వచ్చారు.

స్వామిజీ భారతదేశంలోని నాలుగు ముఖ్య నగరాలలో (బెంగళూరు, చెన్నై, అహ్మదాబాద్ మరియు నోయిడా) మరియు నేపాల్లోని ఖాట్మండులో పర్యటిస్తారు, ఆయన పర్యటించే ప్రాంతాలలో ప్రత్యేక ఒక-రోజు కార్యక్రమాలు క్రింద తెలిపిన విధంగా నిర్వహించబడతాయి:

  • ఆదివారం, ఫిబ్రవరి 2: బెంగళూరు
  • ఆదివారం, ఫిబ్రవరి 9: చెన్నై
  • ఆదివారం, ఫిబ్రవరి 23: అహ్మదాబాద్
  • గురువారం, ఫిబ్రవరి 27: నోయిడా
  • శనివారం, మార్చి 1: ఖాట్మండు

ఈ కార్యక్రమాల గురించి మరింత తెలుసుకోవడానికి మరియు నమోదు చేసుకోవడానికి , దయచేసి క్రింది బటన్‌ను క్లిక్ చేయండి.

స్వామీజీ పర్యటన నుండి ఫోటోలను ఆస్వాదించడానికి దయచేసి క్రింది చిత్రాలపై క్లిక్ చేయండి.

భారతదేశంలో ఆగమనము

స్వామిజీ విమానాశ్రయానికి రావడం మరియు బెంగళూరు వద్ద ఆయన స్వాగతం యొక్క కొన్ని ఫోటోలను పంచుకోవడం మాకు సంతోషంగా ఉంది.

ఇతరులతో పంచుకోండి