భగవద్గీత జ్ఞానంపై మా స్ఫూర్తిదాయక ప్రసంగాల శ్రేణిని కొనసాగిస్తూ, వై.ఎస్.ఎస్. సీనియర్ సన్యాసి స్వామి స్మరణానంద గిరిచే తెలుగులో అందించబడే ప్రవచనానికి హాజరు కావాల్సిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. ఈ ప్రసంగం, పరమహంస యోగానంద గారి God Talks With Arjuna లో అందించిన భగవద్గీత వ్యాఖ్యానాన్ని— ఈ ప్రియమైన ధర్మగ్రంథానికి ఆ మహాగురువు భగవద్ప్రేరణతో చేసిన అనువాదం మరియు విస్తృతమైన వ్యాఖ్యానాన్ని— తెలియచేస్తుంది.
ఈ ప్రసంగంలో, స్వామి స్మరణానంద గారు మొదటి అధ్యాయంలోని 4, 5, 6వ శ్లోకాలను వివరిస్తారు. ఈ శ్లోకాలు మేధోమేరు కేంద్రాలలోని ఆధ్యాత్మిక సైనికులైన భక్తి, ఆధ్యాత్మిక స్మృతి, వివేచనాత్మక బుద్ధి, ప్రాణాయామం మొదలైన వాటి గురించి వివరించి చెబుతాయి. ఇవి ఒక భక్తుడు తన లోపలి కురుక్షేత్ర యుద్ధంలో చేసే పోరాటానికి సహాయపడతాయి. ఈ అధిభౌతిక సైనికుల గురించి పరమహంసజీ ఇలా అంటారు: “ఇవి భక్తుడు యోగసాధన చేయడం ద్వారా ఉద్భవించే ఆధ్యాత్మిక ఫలితాలు. ఐదుగురు ముఖ్య పాండవులతో కలిసి, ఇంద్రియాధీన మనస్సులోని దుష్ట సైనికులతో చేసే పోరాటంలో యోగికి సహాయం చేసేందుకు వీరు అతనికి తోడుగా వస్తారు.”
ఈ ప్రసంగం, తరువాత కూడా వీక్షించడానికి అందుబాటులో ఉంటుంది.
భగవద్గీతపై గత ప్రసంగాలు
ఈ ప్రసంగం యొక్క మొదటి, రెండవ, మూడవ భాగాన్ని తెలుగులో వీక్షించడానికి, దయచేసి ఇక్కడ క్లిక్ చేయండి.
ఆంగ్లంలో ఈ శ్రేణిని వీక్షించడానికి, దయచేసి ఇక్కడ క్లిక్ చేయండి, ప్రతి ఒక్కటి అనేక భాగాలుగా ఉంది, స్వామి స్మరణానంద గిరిచే ఇవ్వబడింది.
ఈ పవిత్ర గ్రంథంపై వ్యాఖ్యానం గురించి
ఆధ్యాత్మిక మహాకావ్యమైన ఒక యోగి ఆత్మకథ రచయిత పరమహంస యోగానందగారు భగవద్గీత పై తమ దివ్య అంతర్దృష్టితో వ్యాఖ్యానించారు. తమ వ్యాఖ్యానంలో, దాని మానసిక, ఆధ్యాత్మిక మరియు అధిభౌతిక లోతులను అన్వేషిస్తూ — రోజువారీ ఆలోచనలు మరియు చర్యల యొక్క సూక్ష్మ కారణాల నుండి విశ్వక్రమం యొక్క గొప్ప రూపకల్పన వరకు — జ్ఞానోదయం వైపు ఆత్మ చేసే ప్రయాణం యొక్క విస్తృత వృత్తాంతాన్ని యోగానందగారు పరిశోధిస్తారు.
గీత యొక్క సంతులిత ధ్యానమార్గం మరియు సరైన కార్యాచరణను స్పష్టంగా వివరిస్తూ, ఆధ్యాత్మిక సమగ్రత, ప్రశాంతత, సరళత మరియు ఆనందంతో కూడిన జీవితాన్ని మనం ఎలా సృష్టించుకోవచ్చో పరమహంసగారు చూపిస్తారు. మన జాగృత సహజావబోధం ద్వారా జీవిత మార్గంలోని ప్రతి కూడలిలో తీసుకోవాల్సిన సరైన మార్గాన్ని మనం తెలుసుకుంటాం. ఏ లోపాలు మనల్ని వెనక్కి నెట్టివేస్తున్నాయో, ఏ సానుకూల లక్షణాలు మనల్ని ముందుకు నడిపిస్తున్నాయో గుర్తించగలము, మరియు మార్గంలో ఉన్న ఆపదలను గుర్తించి నివారించగలము.

















