ప్రియతములారా,
యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా (వై.ఎస్.ఎస్.) బోర్డు డైరెక్టర్ల యొక్క రెండు ముఖ్యమైన మార్పుల గురించి నేను మీకు తెలియజేయాలనుకుంటున్నాను.
2002 నుండి వై.ఎస్.ఎస్. బోర్డు డైరెక్టర్లలో ఒక సభ్యునిగా మరియు 2007 నుండి ప్రధాన కార్యదర్శిగా సేవలందించిన స్వామి స్మరణానంద, దీర్ఘకాలంపాటు ఖాళీగా ఉన్న ఉపాధ్యక్ష స్థానాన్ని ఇప్పుడు భర్తీ చేస్తారు. గురుదేవులకు ప్రియమైన వై.ఎస్.ఎస్. కు ప్రధాన కార్యదర్శిగా భక్తివిశ్వాసాలతో, అంకితభావంతో సేవలందించిన స్వామి స్మరణానందగారికి నా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. ఆయన మార్గదర్శకత్వంలో మరియు నాయకత్వంలో గురుదేవుల పవిత్ర క్రియాయోగ బోధనలు విస్తృతంగా వ్యాపించాయి మరియు వై.ఎస్.ఎస్. గొప్ప అభివృద్ధిని నమోదు చేసింది. ఆయన హయాంలో బోర్డు డైరెక్టర్లు, సన్యాసులు, అంకితభావంగల సాధారణ భక్తుల సహకారంతో, వై.ఎస్.ఎస్. ఎన్నో ముఖ్యమైన లక్ష్యాలను చేరుకొంది.
2011 నుండి వై.ఎస్.ఎస్. బోర్డు డైరెక్టర్లలో ఒక సభ్యునిగా సేవలందించిన స్వామి ఈశ్వరానంద, యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యదర్శిగా స్వామి స్మరణానంద స్థానాన్ని భర్తీ చేస్తారు. స్వామి ఈశ్వరానందగారు గురుదేవుల కార్యాచరణలో అనేక హోదాల్లో సమర్ధవంతంగా సేవలందించారు. ఆయన, లాస్ ఏంజిలిస్ లోని సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్/యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా అంతర్జాతీయ ప్రధాన కార్యాలయంలో ఉన్నప్పుడు మన ప్రియతమ పూర్వపు అధ్యక్షురాలు శ్రీ శ్రీ దయామాత ఆధ్వర్యంలో సేవలందిస్తూ, వివిధ పరిపాలనా బాధ్యతల్లో ఆమెకు సహకరిస్తూ ఐదేళ్లపాటు విలువైన శిక్షణ పొందారు.
స్వామి స్మరణానంద మరియు స్వామి ఈశ్వరానంద తమ నూతన బాధ్యతలను నిర్వర్తించేందుకు, భగవంతుడు మరియు గురువుల ఆశీస్సులు లభించాలని మనం ప్రార్థిద్దాం, మరియు సత్యాన్వేషక ఆత్మలకు గురుదేవుల కార్యాచరణ అయిన క్రియాయోగం యొక్క ఆత్మ-విముక్తి బోధనల నిరంతర వ్యాప్తికి మరియు వృద్ధికి మేము ఎదురుచూస్తున్నాం.
గురుదేవుల ప్రేమ మరియు సేవలో.
స్వామి చిదానంద గిరి
అధ్యక్షులు, యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా/సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్



















