“సద్గురువు బోధలను శ్రవణం చేయడమనేది శిష్యుడిని పరమగమ్యం వైపు పయనింపజేసే ఒక కళ. శాస్త్రీయ యోగం, సాంఖ్య తర్కం గురించి భక్తుడికి ఏమీ తెలియకపోయినా మరియు కర్మయోగి కాగల యోగ్యత కొరకు తన కార్యకలాపాల నుండి తనని తాను తగినంతగా విడదీయ లేకపోయినా, తన గురువు బోధనలను పూర్తి విశ్వాసంతో అనుసరించడం ద్వారా అతడు విముక్తిని సాధిస్తాడు.”
— శ్రీ శ్రీ పరమహంస యోగానంద
శ్రీ శ్రీ పరమహంస యోగానందగారి పవిత్ర ఆవిర్భావ దినోత్సవం (జన్మదినం) సందర్భంగా మీ అందరికీ ప్రేమపూర్వక శుభాకాంక్షలు. ఈ సమయంలో మనం భక్తి మరియు కృతజ్ఞతతో కలుసుకొని, మన ప్రియమైన గురుదేవుల జీవితాన్ని మరియు వారు నిర్వహించిన ఆధ్యాత్మిక బృహత్కార్యాన్ని స్మరించుకుందాం, వారి దివ్య సాన్నిథ్యం ప్రపంచవ్యాప్తంగా మానవులను ఆశీర్వదిస్తూ, పరివర్తన తీసుకువస్తూనే ఉన్నది. పవిత్రమైన క్రియాయోగ శాస్త్రాన్ని గురించి తాను వెల్లడించిన బోధనల ద్వారా, పరమాత్మలోని తమ శాశ్వత నివాసానికి తిరిగి వెళ్ళేందుకు అసంఖ్యాక సాధకులకు స్ఫూర్తినిస్తూ, దైవాన్ని చేరే ఒక శాశ్వతమైన మార్గాన్ని గురుదేవులు ప్రకాశింపజేశారు.
గురుదేవుల కార్యాచరణ కొనసాగించడం కోసం మద్దతు ఇచ్చే ఒక అవకాశం
సత్యమైన ఆధ్యాత్మిక మార్గం కోసం అన్వేషిస్తున్న వేలాది మంది సాధకులకు మేము చేరువయ్యేందుకు సహకరించిన మీ ఉదారమైన మద్దతుకు ధన్యవాదాలు. పరమహంసగారి బోధనల కాంతి ఎల్లప్పుడూ వెలుగులీనుతూ, సరిహద్దులను, భాషలను దాటి అసంఖ్యాక జీవితాలను ప్రకాశవంతం చేస్తోంది. ఈ ఎదుగుదలతో, ఆయన జ్ఞానం ద్వారా సాంత్వన పొందిన వారందరికీ మా ఈ సేవను మెరుగుపరిచే పవిత్రమైన బాధ్యత చేకూరుతుంది. గురుదేవుల కార్యాచరణకి మద్దతు ఇవ్వడం ద్వారా ఈ పవిత్ర ఆధ్యాత్మిక బృహత్కార్యంలో మాతో చేరాలని మేము మిమ్మల్ని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. మనం ఒక నూతన సంవత్సరంలోకి అడుగుపెడుతున్న తరుణంలో, వృద్ధి చెందుతున్న మన ఆధ్యాత్మిక కుటుంబానికి సేవ చేసేందుకు మేము సాధించినవాటిని మరియు భవిష్యత్ ప్రణాళికలు పంచుకోవడానికి మేము సంతోషిస్తున్నాము:
- పరమహంసగారి క్రియాయోగ బోధనలు మరియు జ్ఞాన ప్రచురణలను వివిధ భారతీయ భాషలలో అందుబాటులో ఉంచడం
- వై.ఎస్.ఎస్. సన్యాసులు నిర్వహించే ప్రత్యక్ష మరియు ఆన్‌లైన్ కార్యక్రమాల ద్వారా భక్తులకు ఆధ్యాత్మిక మద్దతును అందించడం
- వై.ఎస్.ఎస్. ఆశ్రమాల సంరక్షణ
ఈ కార్యాలను పూర్తి చేయడానికి ₹15 కోట్లు ఖర్చవుతుందని మేము అంచనా వేస్తునాం. ఈ పవిత్ర ప్రయత్నానికి మేము మీ ఉదారమైన మద్దతునివ్వమని విజ్ఞప్తి చేస్తున్నాం.
మీ మద్దతు గాఢంగా ప్రశంసించబడుతుంది
మీ ఉదారమైన సమర్పణల ద్వారా, గురుదేవుల బోధనలు భారతదేశం మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న లెక్క లేనన్ని ఆత్మలకు చేరాయి. రాబోయే తరాల కోసం ఈ దివ్య వారసత్వాన్ని పరిరక్షించడానికి, విస్తరించడానికి చేతులు కలుపుదాం. మీ మద్దతు — ప్రార్థనలు, సేవ లేదా ఆర్థిక సహకారం — గురుదేవుల కాంతిని మరియు ప్రేమను ప్రపంచం నలుమూలలకు వ్యాప్తి చేసేందుకు ఎంతో ఆవశ్యకమైనది.
సన్యాసులమైన మేము, గురుదేవుల ఆశ్రమాలలో సేవ చేస్తున్న సేవకులతో పాటు, మీ ప్రేమ, ప్రార్థనలు మరియు ఉదార సహకారాలకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము మరియు ఈ పావన సందర్భంలో మీకు శాంతి మరియు ఆనందం కలగాలని కోరుకుంటున్నాము.
గురుదేవుల ప్రేమలో,
యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా
దిగువన ఉన్న పూర్తి విజ్ఞప్తిని చదవండి:
దైవసాక్షాత్కారానికి ఒక మార్గం చూపిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న అసంఖ్యాక సాధకులకు పరమహంస యోగానందగారి బోధనలు స్ఫూర్తినిచ్చి ఉన్నతిని చేకూర్చాయి. ఈ పవిత్ర బోధనలను మరిన్ని భాషల్లో అందుబాటులో ఉంచడానికి మేము కట్టుబడి ఉన్నాము, తద్వారా గురుదేవుల ఉత్కృష్టమైన బోధనల నుండి మరింత మంది ప్రయోజనం పొందవచ్చు. వీలైనంత ఎక్కువ మంది సత్యాన్వేషకులు గురుదేవుల సందేశాన్ని అర్థం చేసుకొని, గ్రహించే భాషలోనే వారికి చేరేలా చేయడమే మా నిరంతర ప్రయత్నం.
గురుదేవుల జ్ఞానం యొక్క పరిధిని విస్తరించడం
వై.ఎస్.ఎస్. పాఠాల క్రొత్త సంచికలు
గురుదేవుల ఆకాంక్షలకు అనుగుణంగా, ఒక నూతన మరియు సమగ్రమైన వై.ఎస్.ఎస్. పాఠాల సంచిక 2019లో ఆంగ్లంలో విడుదలైంది. మేము ఇప్పటికే ఈ సంచికను హిందీ, తమిళం మరియు తెలుగులో అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అదనపు భాషల్లో అనువాదాలు ప్రస్తుతం పురోగతిలో ఉన్నాయి. భక్తులు ఈ అనువాదాలను ఉత్సాహంగా స్వాగతించారు మరియు వారి స్వంత భాషలో ఈ బోధనలను అందించినందుకు తమ కృతజ్ఞతలను లిఖితపూర్వకంగా మాకు తెలియజేశారు.
“ప్రతి పేజీ గురుదేవుల జ్ఞానం మరియు ప్రేమతో సజీవమై నన్ను నా ఆత్మ వైపు నడిపించే ఒక దివ్య సూచికలా వై.ఎస్.ఎస్. పాఠాలు అనిపిస్తున్నాయి. ఈ పవిత్ర బోధనలను మా భాషలోకి అనువదించినందుకు నేను చాలా కృతజ్ఞుడను.”
– కె.ఎం. తిరువళ్లూరు, తమిళనాడు
అనుబంధ సమాచారం మరియు పాఠాల యాప్
పాఠాల విద్యార్థులు, తమ దైనందిన జీవితంలో గురుదేవుల బోధనలను వర్తింపజేసుకోవడానికి ఆచరణాత్మక మార్గదర్శకత్వాన్ని అందించే విలువైన అనుబంధ సమాచారాన్ని కూడా అందుకుంటారు. ఈ సాధనములు, సన్యాసులు వివిధ భారతీయ భాషల్లో నిర్వహించే నిర్దేశిత ధ్యానాలు మరియు వీడియో తరగతులను కలిగి ఉండి, భక్తులు ధ్యాన ప్రక్రియలను బాగా అర్థం చేసుకోవడానికి మరియు గాఢం చేసుకోవడానికి సహాయపడతాయి.
“ఆశ్రమాలు చాలా దూరంలో ఉన్నందున, ఒక సన్యాసి నుండి వివరణాత్మక వ్యక్తిగత మార్గదర్శకత్వం పొందడానికి ప్రయాణించడం సవాలుతో కూడుకున్నది. అయితే, నా మాతృభాషలో ఏకాగ్రత సాధించగల ఏకాగ్రత ప్రక్రియపై వీడియో తరగతిని చూడగలగడం నిజంగా ఒక గొప్ప ఆశీర్వాదం. అది స్పష్టంగా ఉండడం వలన, ప్రక్రియను మరింత ప్రభావశీలంగా అర్థం చేసుకోవడంలో మరియు సాధన చేయడంలో నాకు సహాయపడింది.”
– టీ.పీ, కాకినాడ, ఆంధ్రప్రదేశ్
భక్తులు పాఠాలు సులభంగా డిజిటల్‌గా చదువుకునేందుకు వీలుగా మేము వై.ఎస్.ఎస్. పాఠాల యాప్‌ను ఉచితంగా అందిస్తున్నాము. వాక్యం-నుండి-మాటలు వినగలిగే సమర్థత గల ప్రయోజనాత్మక ఉపయోగంతో మెరుగైన ఈ-రీడర్; విషయసూచిక ఆధారంగా అనుబంధ పాఠాల బ్రౌజింగ్; వై.ఎస్.ఎస్. వార్తలు మరియు బ్లాగులకు ప్రవేశ సాధనం; నిర్దేశిత మరియు ఆన్‌లైన్ ధ్యానాలలో పాల్గొనడం వంటి ముఖ్య అంశాలు కలిగి ఉన్నాయి.
పుస్తకాల అనువాదం
పాఠాలకు అదనంగా, గురుదేవుల ఆధ్యాత్మిక మహాకావ్యం ఒక యోగి ఆత్మకథ మరియు వారి ఇతర ప్రచురణలను అనేక ఇతర భారతీయ భాషలలోకి అనువదించి మరియు వాటిని ముద్రణ, ఆడియో మరియు డిజిటల్ రూపాలలో అందుబాటులో ఉంచుతున్నాము. 2024లో, మేము ఒక ఆడియో పుస్తకాన్ని — ఒక యోగి ఆత్మకథ ను గుజరాతీలో విడుదల చేశాము — మరియు వివిధ భాషలలో 16 కొత్త పుస్తకాలను ముద్రించాము.
ఈ పవిత్ర బోధనల వ్యాప్తిలో ఆర్థిక వనరుల అవసరం ఎంతో ఉంటుంది, వీటిలో:
- వై.ఎస్.ఎస్. పాఠాల సభ్యత్వం రాయితీకి ఇవ్వడం ద్వారా ప్రతి ఒక్కరూ ఈ బోధనలను పొందగలిగేలా చేయడం.
- గురుదేవుల పుస్తకాలను మరిన్ని భాషల్లోకి అనువదించడం మరియు ప్రచురించడం.
- నేటి డిజిటల్ ప్రపంచంలో సత్యాన్వేషకుల అవసరాలకు అనుగుణంగా మెరుగైన సేవలందించేందుకు సాంకేతికతను అభివృద్ధి చేయడం మరియు నవీకరించడం.
మా పాఠాలు మరియు అన్ని పుస్తకాలు గణనీయమైన సబ్సిడీలను అందించడం ద్వారా, పోల్చదగిన మార్కెట్ ధరల కంటే చాలా తక్కువ ధరలను మేము కొనసాగించగలిగాము, ఈ సందర్భంలో మీ ఉదార మద్దతుకు ధన్యవాదాలు. రాబోయే సంవత్సరంలో, గురుదేవుని పరివర్తనాత్మక బోధనలను కోరుకునే వారందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి మీరు సహకరిస్తారని విశ్వసిస్తూ, అన్ని బోధనలను ఇంకా తక్కువ ధరలకు అందించాలని మేము ప్రణాళిక వేస్తున్నాము.
వివిధ కార్యక్రమాలు మరియు ప్రణాళికల ద్వారా భారత ఉపఖండమంతటా భక్తులకు మద్దతు ఇవ్వాలనే తన నిబద్ధతలో వై.ఎస్.ఎస్. ధృఢంగా ఉంది:
సన్యాసుల పర్యటనలు, సంగమాలు మరియు క్రియా దీక్షలు
2024లో, భారతదేశం మరియు శ్రీలంక అంతటా 50 కంటే ఎక్కువ నగరాల్లో వై.ఎస్.ఎస్. సన్యాసులు పర్యటించి ప్రసంగాలను, క్రియాయోగ దీక్షలను మరియు వేలాది మంది హృదయాలను స్పృశించిన ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించారు. అదనంగా, రాంచీ, నోయిడా, దక్షిణేశ్వరం, చెన్నైల్లోని మా ఆశ్రమాలలో మరియు ఇగత్‌పురి సాధనాలయంలో మేము 20 సాధనా సంగమాలను నిర్వహించాము, గాఢమైన ఆధ్యాత్మిక పునరుత్తేజం కోసం గురుదేవుల బోధనలలో 3,500 మంది భక్తులు నాలుగు రోజులపాటు నిమగ్నమయ్యే అవకాశాన్ని అవి కలిగించాయి. మా సన్యాసులు నోయిడా ఆశ్రమంలో 10 ఏకాంత ధ్యాన వాసాలను నిర్వహించారు మరియు పూరి, దిహికా ఏకాంత ధ్యాన వాస కేంద్రాలలో కూడా ఏకాంత ధ్యాన వాసాలను నిర్వహించారు.
ఆన్‌లైన్ స్ఫూర్తిదాయక కార్యక్రమాలు
వ్యక్తిగతంగా జరిగే కార్యక్రమాలు మా ప్రయత్నాలకు మూలాధారంగా ఉన్నప్పటికీ, దూరం, ఆరోగ్యం లేదా ఇతర పరిమితుల కారణంగా అటువంటి కార్యక్రమాలకు హాజరుకాలేని వారిని చేరుకోవడం యొక్క ప్రాముఖ్యతను మేము గుర్తించాము, వై.ఎస్.ఎస్. సన్యాసులు ఆన్‌లైన్ వేదికల ద్వారా క్రమం తప్పకుండా చేరుకోవడానికి సంయుక్త ప్రయత్నాలు చేస్తున్నారు. 2024లో ప్రతివారం జరిగే ధ్యానాలతో పాటు, గురుదేవుల పరివర్తనకారక “ఎలా జీవించాలి” అనే సూత్రాలపై 30కి పైగా ప్రత్యేక కార్యక్రమాలు మరియు ఉపన్యాసాలు వై.ఎస్.ఎస్. వెబ్‌సైట్ మరియు ఆన్‌లైన్ ఛానెల్ ద్వారా నిర్వహించబడ్డాయి, తద్వారా భక్తులు ఎక్కడ ఉన్నా ఆచరణాత్మక ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం మరియు మద్దతు అందించబడుతోంది.
నూతన సంవత్సరంలో ప్రత్యేక కార్యక్రమాలు
- భక్తులకు స్ఫూర్తిని, ఉన్నతిని కలిగించేందుకు, మా గౌరవనీయ అధ్యక్షులు మరియు ఆధ్యాత్మిక అధిపతి స్వామి చిదానందగారు రాబోయే వారాల్లో భారతదేశం మరియు నేపాల్‌ను సందర్శించనున్నారు. బెంగుళూరు, చెన్నై, అహ్మదాబాద్, నోయిడా మరియు ఖాట్మండులలో ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేయబడ్డాయి. వీటి ద్వారా వారి దర్శనాన్ని మరియు వారి ఉత్కృష్టమైన జ్ఞానం, ఆచరణాత్మక ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం నుండి భక్తులు ప్రయోజనం పొందేందుకు ఒక దివ్యమైన అవకాశాన్ని పొందుతారు.
- ప్రయాగరాజ్‌లోని పవిత్ర కుంభమేళాకు భక్తులను స్వాగతించడానికి మేము సన్నాహాలు చేస్తున్నాము. వై.ఎస్.ఎస్. శిబిరం వద్ద వారికి బస, భోజన ఏర్పాట్లు చేయబడతాయి. భక్తులకు ఒక ఆధ్యాత్మికంగా ఉన్నతమైన అనుభవాన్ని కలిగించేందుకు శిబిరంలో వై.ఎస్.ఎస్. సన్యాసులు సామూహిక ధ్యానాలు మరియు సత్సంగాలను నిర్వహిస్తారు.
అన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలు మరియు ఇతర కార్యక్రమాలలోను ప్రతి ఒక్కరూ ఖర్చులను భరించేలా, వాటిని నామమాత్రంగా ఉంచడానికి వై.ఎస్.ఎస్. ప్రయత్నిస్తోంది, మరియు అలా చేసేందుకు, అటువంటి కార్యక్రమాలను నిర్వహించడంలో ఉన్న గణనీయమైన ఖర్చులను తట్టుకొనేందుకు మీ మద్దతు మాకు కీలకమైన సహాయకారిగా ఉంటుంది.
సాధకులు దివ్యశాంతి మరియు ఆధ్యాత్మిక పునరుత్తేజం పొందే పవిత్రస్థలాలుగా వై.ఎస్.ఎస్. ఆశ్రమాలు ఉండాలని గురుదేవులు భావించారు, ఇక్కడ సాధకులు సాంత్వన పొందవచ్చు, గాఢంగా ధ్యానం చేసుకోవచ్చు మరియు సన్యాసుల నుండి ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం పొందవచ్చు. ఈ పవిత్రప్రదేశాలు భక్తుల ఆధ్యాత్మిక జీవితంలో కీలక పాత్ర పోషిస్తాయి, కాని వాటిని నిర్వహించడానికి ఆవశ్యకమైన వనరులు మరియు అంకితమైన సంరక్షణ అవసరం.
“రాంచీ ఆశ్రమంలో ప్రవేశించడం, శాంతి మరియు ప్రేమతో కూడిన స్వర్గరాజ్యంలోకి అడుగుపెట్టినట్లుగా అనిపిస్తుంది. ధ్యాన ప్రశాంతత, అందంగా నిర్వహించబడే పరిసరాలు మరియు ఆహ్లాదకరమైన ఆతిథ్యం, నన్ను ప్రపంచం నుండి వేరు చేసి, వెంటనే దైవంతో అనుసంధానం పొందే వాతావరణాన్ని సృష్టిస్తాయి.”
— డి.ఎం. కొల్హాపూర్, మహారాష్ట్ర
ధ్యాన వనాలు, ధ్యాన మందిరాల నుండి రాంచీలోని లిచీ వేది మరియు స్మృతి మందిరం వంటి దర్శనీయ ప్రదేశాల వరకు, ప్రతి స్థలం ప్రశాంతమైన మరియు ఆధ్యాత్మికతతో నిండిన వాతావరణాన్ని సృష్టించేట్లుగా ఏర్పాటు చేయబడ్డాయి. ఈ పవిత్ర స్థలాలు భక్తులకు, భగవంతుడు మరియు గురువుతో తమ సంబంధాన్ని మరింతగా పెంపొందించుకోవడానికి ప్రేరేపిస్తాయి, తద్వారా ఆంతరిక శాంతిని మరియు దైవంతో అనుసంధానాన్ని పెంపొందించుకోవచ్చు.
భక్తులకు ఎటువంటి ఖర్చు లేకుండా సౌకర్యవంతమైన వసతి కల్పించాలని వై.ఎస్.ఎస్. ఆశ్రమాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి, తగిన వనరులు లేనివారు కూడా సందర్శించేందుకు మరియు తమ సాధనపై దృష్టి పెట్టేందుకు భక్తులందరికీ వీలు కల్పిస్తాయి. ఆధునిక అతిథి సౌకర్యాలు, సమర్థవంతమైన గృహ నిర్వహణ సేవలు, ప్రశాంతమైన మరియు ఉన్నతమైన అనుభవాన్ని సందర్శకులందరికీ అందించేందుకు పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ఇవి కలిగి ఉన్నాయి.
నిర్వహణ ఖర్చులు
ఈ ఆశ్రమాలను నడపడానికి మరియు నిర్వహించడం కోసం గణనీయమైన ఖర్చులు ఉంటాయి:
- సందర్శించే భక్తులకు గదులు, భోజనాలు మరియు సౌకర్యాలు కల్పించడం
- ఈ సౌకర్యాలను అందించేందుకు సేవ చేసే మరియు నిర్వహించే సిబ్బందికి జీతాలు
- అతిథి సౌకర్యాలు, ధ్యాన మందిరాలు మరియు ఇతర మౌలిక సదుపాయాల పునరుద్ధరణ మరియు నిర్వహణ
మీ విరాళాలు ఈ పవిత్ర స్థలాలను సంరక్షించడానికి, అసంఖ్యాక సత్యాన్వేషకులకు స్వాంతనను మరియు ఆధ్యాత్మిక పునరుద్ధరణను అందించేందుకు, మా సేవా కార్యకలాపాలు కొనసాగేలా సాధ్యం చేస్తాయి. అన్ని వర్గాల సాధకులకు ఆధ్యాత్మికంగా ఉత్సాహభరితమైన మరియు మర్యాదపూర్వక వాతావరణాన్ని అందించాలనే గురుదేవుల ఆలోచనను మనం కలిసి నెరవేర్చగలము.
ఈ పవిత్ర ఆశ్రమాలను నిర్వహించడం, భారతీయ భాషల్లో గురుదేవుల బోధనల ప్రచురణకు మద్దతు ఇవ్వడం, వ్యక్తిగత మరియు ఆన్‌లైన్ కార్యక్రమాలు రెండిటినీ నిర్వహించడానికి అయ్యే వార్షిక వ్యయం ₹15 కోట్లు.



















