గురుదేవులు శ్రీ శ్రీ పరమహంస యోగానందగారి మానవతావాద ఆదర్శాలచే మార్గనిర్దేశం చేయబడిన యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా, ఝార్ఖండ్, పశ్చిమ బెంగాల్ మరియు ఉత్తరాఖండ్ రాష్ట్రాలలో అనేక విద్యా సంస్థలను నిర్వహిస్తోంది. ఈ సంస్థలు, ఉత్తమ ప్రమాణాలతో కూడిన విద్య మరియు సత్ప్రవర్తన రెండింటినీ పెంపొందించే విద్యను అందజేస్తూ, వెనుకబడిన వర్గాల నుండి వచ్చిన విద్యార్థులకు సేవ చేయడానికి ప్రయత్నిస్తున్నాయి.
ఇటీవలి బోర్డ్ పరీక్షల్లో రాంచీలోని యోగదా సత్సంగ మహావిద్యాలయంలోని మా ఇంటర్మీడియట్ విభాగం (10+2) విద్యార్థులు సాధించిన విశేషమైన విజయాలను పంచుకోవడానికి మేము సంతోషిస్తున్నాము. మా విద్యార్థులు ప్రశంసనీయమైన ఉత్తమ విజయాన్ని సాధించి, రాష్ట్ర స్థాయిలో విశిష్ట ప్రతిభను కనబరిచారు.

- కుమారి ముస్కాన్ కుమారి (కామర్స్) 94.2% మార్కులతో రాంచీలో మొదటి స్థానం మరియు రాష్ట్ర మెరిట్ జాబితాలో ఐదో స్థానాన్ని సాధించింది. నిరాడంబరమైన నేపథ్యం నుండి వచ్చిన ఆమె, ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూనే, నిశ్చలమైన క్రమశిక్షణ మరియు దృఢ సంకల్పంతో ఈ విజయాన్ని సాధించింది. స్థానిక ప్రసార సాధనాలలో విస్తృతంగా ప్రసారం చేయబడిన ఆమె విజయం, కేంద్రీకరించబడిన కృషి యొక్క శక్తికి నిదర్శనం. త్వరలో రాంచీ డిప్యూటీ కమిషనర్ శ్రీ మంజునాథ్ భజంత్రీ ఆమెను సత్కరించబోతున్నారు.
- నిరంతర శ్రమ అందించే ఫలితాలకు ఉదాహరణగా నిలిచిన కుమారి కావ్య కౌషికి (కామర్స్) 93.2% మార్కులతో రాంచీలో మూడో స్థానం మరియు రాష్ట్రంలో ఏడవ స్థానాన్ని కైవసం చేసుకున్నారు.


పరీక్షా విజేతలను సత్కరిస్తున్న స్వామి నిశ్చలానంద.
ఈ విజయాలు, అంకితభావంతో కూడిన మా అధ్యాపకుల మార్గదర్శకత్వం, మా సంస్థలలోని సహాయకరమైన అభ్యాస వాతావరణం మరియు—అన్నింటి కంటే మిన్నగా—గురుదేవుల ప్రేమ మరియు ఆశీస్సుల ఫలితమే. ఉత్తమ ప్రతిభ కనబరచిన మా విద్యార్థులందరికీ మా హృదయపూర్వక అభినందనలు, అలాగే సత్ప్రవర్తన, సేవా భావం మరియు ఆధ్యాత్మిక విలువలతో కూడిన విద్యను అందించాలనే ధ్యేయాన్ని మరింతగా ముందుకు తీసుకువెళ్ళేందుకు అవిశ్రాంతంగా కృషి చేస్తున్న సిబ్బందికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు.
వార్తా పత్రికలలో ప్రచురితమైన కథనాలు:
