సుందరమైన హిమాలయ ప్రాంగణంలో వేసవి శిబిరాలు నిర్వహించిన వై.ఎస్.ఎస్.
(బాలలు మరియు కౌమారుల కోసం, మే 31 – జూన్ 6, 2026)

10 జూలై, 2026
శూలిని విశ్వవిద్యాలయంలో నిర్వహించబడిన వై.ఎస్.ఎస్. వేసవి శిబిరాన్ని ఉత్సవదీపం వెలిగించి, లాంఛనంగా ప్రారంభించిన స్వామి లలితానందగారు. ఆయనతో పాటు స్వామి
నిర్మలానందగారు, శూలిని విశ్వవిద్యాలయం వ్యవస్థాపకులు ప్రొఫెసర్ ప్రేమ్ కుమార్ ఖోస్లా, శ్రీమతి సరోజ్ ఖోస్లా మరియు వైస్-ఛాన్సలర్ డా. అతుల్ ఖోస్లాలను కూడా చూడవచ్చు.

అఖిలభారత యువజన సంపర్క కార్యక్రమంలో ఒక నూతన అధ్యాయం

వై.ఎస్.ఎస్. యువజన సేవావిభాగం తమ అతిపెద్ద వారంరోజుల వేసవి శిబిరాన్ని హిమాచల్ ప్రదేశ్ లోని సోలన్ లో ఉన్న శూలిని విశ్వవిద్యాలయంలో మే 31 మరియు జూన్ 6, 2026 తేదీల మధ్య నిర్వహించింది. దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి 11 నుంచి 17 సంవత్సరాల వయసుగల 100 మంది పైగా బాలురు, 100 మంది పైగా బాలికలు రెండు వేర్వేరు శిబిరాలలో పాల్గొన్నారు.

ఈ శిబిరాలు, మూడు వేర్వేరు వయోబృందాల వారి ప్రత్యేకమైన అవసరాలను నెరవేర్చడానికి రూపొందించబడ్డాయి – జూనియర్లు (11-13 సంవత్సరాల వారు), మధ్య-కౌమారదశలోనివారు (14-15 ఏళ్లు) మరియు సీనియర్లు (16-17 ఏళ్ల వయస్సువారు). అంతేకాకుండా, 18-23 సంవత్సరాల మధ్య వయస్సువారు, ఈ అనుభవం ద్వారా వీరు భవిష్యత్తులో మరింత బాధ్యతాయుతమైన సేవాబాధ్యతలను మోసే స్థాయికి ఎదిగే విధంగా, సహాయక బృందనాయకులు (అసిస్టెంట్ గ్రూప్ లీడర్స్) గా నియమించబడ్డారు.

గురుదేవులు శ్రీ శ్రీ పరమహంస యోగానంద గారి జీవించడం ఎలా బోధనలపై ఆధారితమైన ఈ శిబిరం శరీరం, మనస్సు, మరియు ఆత్మల సంతులిత అభివృద్ధిని ప్రోత్సహించింది. ఆధ్యాత్మిక దినచర్య మరియు క్రమశిక్షణ ముఖ్యాంశాలుగా గల ఈ శిబిరం, ప్రతి ఉదయం మరియు సాయంత్రం, సామూహిక శక్తిపూరణ వ్యాయామాలు మరియు ధ్యానంపై దృష్టి కేంద్రీకరించింది.

వై.ఎస్.ఎస్. సన్యాసులు మరియు అనుభవజ్ఞులైన అధ్యాపకులు నిర్వహించిన జీవించడం-ఎలా పాఠాలు నిర్భయం, ఏకాగ్రత, సంకల్పబలం, స్నేహం మరియు సహజావబోధం వంటి అంశాలపై కేంద్రీకరిస్తూ, వాటిని వయస్సుకు తగిన సామూహిక చర్చలతో జోడించి, కౌమారదశలోనివారు ముఖ్యమైన జీవన సూత్రాలను గ్రహించడంలో సహాయపడ్డాయి. ఈ తరగతులు, వై.ఎస్.ఎస్. ధ్యానప్రక్రియలపై వై.ఎస్.ఎస్. సన్యాసులు నిర్వహించిన పాఠాలతో ముగిశాయి – వీటిలో, అర్హతగల శిబిరవాసులు విశ్వశక్తితో శరీరాన్ని శక్తివంతం చేసే కళను, హాంగ్-సా ప్రక్రియ ద్వారా మనస్సును ఏకాగ్రం చేయడాన్ని, ఓం ధ్యానప్రక్రియ ద్వారా భగవంతుడితో అనుసంధానమవడాన్ని నేర్చుకున్నారు.

తల్లితండ్రుల అభిప్రాయాలు

అనేకమంది తల్లితండ్రులు తమ పిల్లలు శూలిని విశ్వవిద్యాలయంలోని వేసవి శిబిరం వల్ల ఏ విధంగా పరివర్తన చెందారో తెలియజేస్తూ, వై.ఎస్.ఎస్.కు కృతజ్ఞతతో సందేశాలు పంపించారు. వాటిలో కొన్నింటిని ఈ క్రింద చూడగలరు:

శిబిరాల యొక్క వీడియో ముఖ్యాంశాలు

అద్భుతమైన ప్రకృతి నేపథ్యం

హిమాలయ పర్వతపాద ప్రాంతాలలో, శివాలిక్ పర్వతశ్రేణి నడుమ ఉన్న శూలిని విశ్వవిద్యాలయం, సుందరమైన కాలిబాటలు (హైకింగ్ ట్రయల్స్) మరియు దేవదారు వనాలు అల్లికగా కూడిన 25 ఎకరాల విశాలమైన ప్రాంగణాన్ని కలిగి ఉంటుంది. ఈ ఆవరణ సుందరమైన దృశ్యాలను, చల్లటి వాతావరణాన్ని, మరియు శాంతిమయమైన పరిసరాలను అందిస్తుంది. ఈ స్ఫూర్తిదాయకమైన పరిసరాలు శిబిరవాసుల అనుభవంలో ఒక ముఖ్యభాగమై, సంతోషదాయకమైన అభ్యాసాన్ని మరియు ప్రకృతిలో భగవంతుడి ఉనికి యొక్క లోతైన గ్రహింపును వృద్ధి చేశాయి.

బాలురకు మరియు బాలికలకు వేర్వేరు శిబిరాలు

బాలుర శిబిరం

వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. అధ్యక్షల నుంచి సందేశం

వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. అధ్యక్షులు మరియు ఆధ్యాత్మిక అధిపతి అయిన శ్రీ శ్రీ స్వామి చిదానంద గిరి గారి నుంచి వచ్చిన స్ఫూర్తిదాయకమైన సందేశాన్ని సీనియర్ వై.ఎస్.ఎస్. సన్యాసి స్వామి లలితానంద గిరి చదివి, వివరించడంతో ఆ కార్యక్రమం ప్రారంభమయ్యింది (దిగువన చూడండి).

కౌమారదశలోని యువజనుల ఆధ్యాత్మిక శిక్షణ

సామూహిక ధ్యానాలు మరియు ధ్యానప్రక్రియల సమీక్షా పాఠాలు

బాలుర శిబిరం ప్రతిరోజూ, సామూహిక శక్తిపూరణ వ్యాయామాల అభ్యాసం మరియు సామూహిక ధ్యానాలతో ప్రారంభమై, వాటి తోటే ముగిసేది.

శక్తిపూరణ వ్యాయామాలపై సమీక్షా తరగతిని నిర్వహిస్తున్న స్వామి నిర్మలానంద.
ఆరుబయట ధ్యానం నిర్వహిస్తున్న స్వామి శంకరానంద

జీవించడం ఎలా తరగతులు

విశ్వవిద్యాలయంలోని సదస్సు మందిరాలలో (సెమినార్ హాళ్లలో) “సహజావబోధం” మరియు “నిర్భయం” అన్న అంశాలపై పరస్పర చర్చలతో కూడిన సదస్సులను స్వామి లలితానంద మరియు స్వామి నిర్మలానంద నిర్వహించారు. అంతేకాకుండా, అనుభవజ్ఞులైన బృందనాయకులు “సంకల్పబలం” వంటి ఇతర ఉపయోగకరమైన విషయాలను పరిశోధించి, వాటిపై చర్చలు జరిపారు.

దైనందిన ఆత్మపరిశీలన

పిల్లలు ప్రతిరోజు, తమ వసతి గదులలో గురుకథ (ఆరుగురు వై.ఎస్.ఎస్. గురువుల జీవితాలలోని కథలు), గీతా పఠనం, సాంస్కృతిక కార్యక్రమాల అభ్యాసం మరియు ఆత్మపరిశీలన (ఆత్మపరిశీలన పట్టిక సహాయంతో) లతో కూడిన బృంద సమావేశాలలో పాల్గొంటూ తమ రోజును ముగించేవారు. తమ దైనందిన జీవితంలోని ప్రతి అంశాన్ని ఆధ్యాత్మికం చేసుకునే విధానాలను యువజనుల లేత మనసులలో నాటడమే ఈ ప్రయత్నం యొక్క ఉద్దేశం.

బాబాజీ గుహ

“బాబాజీ గుహ”ను – వనంలో దాగియున్న ఒక స్థలంలో, సహజపరిణామంలో చేయబడిన ఒక బాబాజీ ప్రతిరూపం ప్రతిష్టింపబడిన ఒక గుహవంటి గుడారాన్ని – దర్శించడం పిల్లలు ఎంతో ఇష్టపడిన ఒక కార్యక్రమం.

భక్తిగీతాలను పాడుతూ, ధ్యానం చేసుకుంటూ, తమకు ఇష్టమైన
మహావతార్ బాబాజీ కథలను ఒకరితో ఒకరు చెప్పుకుంటున్న యువజనులు.
“బాబాజీ గుహ” ప్రాంతంలో సాహచర్యాన్ని అనుభవిస్తున్న యువజనులు

విద్యావినోదాలతో కూడిన కార్యక్రమాలు

బాలుర శిబిరం, బాలలు మరియు యువజనులను సరదాగా ఉంచుతూనే, వారిలో క్రమశిక్షణను మరియు ఆత్మావలోకనాన్ని పెంపొందించే అనేక కార్యక్రమాలను కూడి ఉంది.

విశ్వవిద్యాలయ ప్రాంగణ పర్యటన

యుక్తవయస్కులైన (సీనియర్) బాలురకు ఆధునిక విజ్ఞానశాస్త్ర ప్రపంచాన్ని ఆసక్తికరంగా పరిచయం చేసిన విశ్వవిద్యాలయ ప్రాంగణ పర్యటనలు.

క్రీడలు మరియు ఆటలు

బాలుర కోసం ఏర్పాటు చేసిన క్రీడలలో టేబుల్ టెన్నిస్, క్రికెట్, సాకర్ మరియు ఇతర క్రీడలు కూడా ఉన్నాయి.

అరణ్యంలో నడకలు

అడవిలోని కాలిబాటలపై నడవడం సీనియర్ యువజనులకు బాగా నచ్చిన ఒక కార్యక్రమం.

అటవీకరణ కార్యక్రమం

శిబిరవాసులు తమ పేర్లు వ్రాసి ఉన్న మొక్కలను నాటడాన్ని ఎంతో ఆనందించారు; వచ్చే సంవత్సరపు శిబిరంలో వారు తాము నాటిన మొక్కలు ఎంత ఎదిగాయో చూసుకోవచ్చు.

బేకింగ్

ఆహారశాస్త్ర ప్రయోగశాల (ఫుడ్ ల్యాబ్)లో బేకింగ్ కళను నేర్చుకుంటున్న యువజనులు.

కళలు మరియు చేతిపనులు

అలంకరించిన ఫొటో ఫ్రేములను తయారు చేసి...
... వాటిలో తమ బృందం యొక్క ఫొటోను అతికిస్తున్న బాలురు

బృందాలలో కుటుంబ-శైలి భోజనాలు

9 మంది శిబిరవాసుల బృందాలు, ముగ్గురు బృందనాయకుల (పెద్దల)తో, కుటుంబ-భావన కలిగేలా, రోజుకు మూడుసార్లు కలిసి భోజనం చేసేవారు. యోగశాస్త్ర సూత్రాలను అనుసరిస్తూ, ఒకరికొకరు వడ్డించుకుంటూ, మౌనంగా భోజనం చేసి, ఆ తరువాత శుభ్రపరచడంలో సహాయం చేసేవారు.

భోజనానికి ముందు బాలురతో ప్రార్థన చేయిస్తున్న స్వామి నిర్మలానంద.
శిబిరంలో, పిల్లల అభిరుచులకు తగిన సాత్త్విక ఆహారంతో కూడిన
ప్రత్యేక భోజనం ప్రేమపూర్వకంగా అందించేవారు.

సాంసృతిక, ఆధ్యాత్మిక వేడుకలు

సాంస్కృతిక కార్యక్రమం

గురూజీ బోధనలలోని కథల ఆధారితమైన నాటకాంకాలను ప్రదర్శించే ఒక సాయంత్ర ప్రదర్శనను శిబిరవాసులు నిర్వహించారు. వివిధ రకాల సంగీత వాయిద్యాలను కలిగియున్న విశ్వగీతాల (కాస్మిక్ చాంట్స్) యొక్క సమష్టి ప్రదర్శన కూడా ఈ కార్యక్రమంలో ఒక భాగం (క్రింద చూడండి)

ఆధ్యాత్మిక మేళా

శిబిరం యొక్క ఆఖరిరోజున, ఉన్నత యుగమైన ద్వాపర యుగంలో జీవితం ఎలా ఉంటుందో ఊహించడానికి, ఒక సృజనాత్మకమైన కార్యక్రమాన్ని బృందనాయకులు నిర్వహించారు. సహజావబోధం, మనోభావ గ్రహణ (మైండ్ రీడింగ్), జ్ఞాపకశక్తి, సంఘటిత శ్రమ (టీమ్ వర్క్) మొదలైన విషయాలతో కూడిన ఆటల్లో పిల్లలు పాల్గొన్నారు. ఈ ఆధ్యాత్మిక మేళా ఘనంగా విజయవంతమయ్యింది!

ఒక ఆటలో నిమగ్నమై ఉన్న పిల్లలు
ఎస్.ఆర్.ఎఫ్. నుంచి సందర్శిస్తున్న స్వామి నిష్ఠానంద,
యువజనులతో కలిసి ఆధ్యాత్మిక మేళాలో పాల్గొన్నారు.

అభిప్రాయాలు

బాలికల శిబిరం

ప్రారంభోత్సన కార్యక్రమం

వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. అధ్యక్షులు మరియు ఆధ్యాత్మిక అధిపతి అయిన శ్రీ శ్రీ స్వామి చిదానంద గిరి గారి సందేశాన్ని ప్రారంభోత్సవ కార్యక్రమంలో చదువుతున్న స్వామి లలితానంద.

కౌమారుల (టీనేజర్ల) ఆధ్యాత్మిక శిక్షణ

సామూహిక ధ్యానాలు మరియు ధ్యానప్రక్రియల సమీక్షా తరగతులు

బాలికల శిబిరం ప్రతిరోజూ, సామూహిక శక్తిపూరణ వ్యాయామాల అభ్యాసం మరియు సామూహిక ధ్యానాలతో ప్రారంభమై, వాటి తోటే ముగిసేది.

శక్తిపూరణ వ్యాయామాలలో బోధించిన విధంగా శరీరాన్ని విశ్వశక్తితో పునరుత్తేజపరచే
కళను వివరిస్తున్న స్వామి లలితానంద.
హాంగ్-సా సమీక్షా తరగతి ప్రారంభంలో ప్రార్థన చేస్తున్న స్వామి శంకరానంద

జీవించడం ఎలా తరగతులు

యువజనుల చర్చలను మార్గనిర్దేశం చేయడంలో ప్రత్యేక శిక్షణ పొందిన అనుభవజ్ఞులైన అధ్యాపకులు, స్నేహం, సంకల్పబలం, దయ వంటి విషయాలపై (ఈ క్రింద చూపించిన విధంగా) ఆరుబయట మరియు భవనాల లోపల కూడా తరగతులను నిర్వహించారు.

బాబాజీ గుహ

బాలికల హాస్టల్ ప్రాంతంలో ప్రత్యేకంగా వారి వినియోగం కోసం మరొక “బాబాజీ గుహ” ఏర్పాటు చేయబడింది. విశ్వగీతాలాపనలోను, ధ్యానంలోను మరియు కథలు చెప్పుకోవడంలోను బృందనాయకులు వారికి నేతృత్వం వహించారు.

విద్యావినోదాలతో కూడిన కార్యక్రమాలు

బాలికల శిబిరం, బాలలు మరియు కౌమారులను సరదాగా ఉంచుతూనే, వారిలో క్రమశిక్షణను మరియు ఆత్మావలోకనాన్ని పెంపొందించే అనేక కార్యక్రమాలను కూడి ఉంది.

విశ్వవిద్యాలయ ప్రాంగణ పర్యటన

విశ్వవిద్యాల ప్రాంగణ పర్యటనలో, సీనియర్ యువజనులకు విజ్ఞానశాస్త్రం మరియు
కళల (సైన్స్ మరియు ఆర్ట్స్) రంగాలలో ఉన్న పరిశోధన (రీసెర్చ్) అవకాశాలు పరిచయం చేయబడ్డాయి.

క్రీడలు మరియు ఆటలు

బాలికల కోసం ఏర్పాటు చేసిన క్రీడలలో బ్యాడ్మింటన్, బాస్కెట్ బాల్, త్రో బాల్,
ఫ్రిస్బీలతో పాటు భవనం లోపల ఆడే (ఇండోర్) ఆటలు కూడా ఉన్నాయి.

అరణ్యంలో నడకలు

ధ్యానం మరియు వనభోజనాలతో (పిక్నిక్ లంచ్) కూడిన రమణీయమైన నడకలలో యువజనులు పాల్గొన్నారు.

బేకింగ్

ఆహారశాస్త్ర ప్రయోగశాల (ఫుడ్ ల్యాబ్)లో బేకింగ్ కళను నేర్చుకుంటున్న బాలికలు.

కళలు మరియు చేతిపనులు

విశ్వవిద్యాలయం యొక్క నివాస కళాకారులు (ఆర్టిస్ట్-ఇన్-రెసిడెన్స్) శిల్ప చిత్రలేఖనంపై పాఠాలను నిర్వహించారు. వాళ్లు రంగులు వేసిన రాళ్లను…

…ఇతర కళలు మరియు చేతిపనుల రూపకల్పనలను చూపిస్తున్న శిబిరవాసులు.

బృందాలలో కుటుంబ శైలి భోజనాలు

బాలుర శిబిరంలో లాగానే, బాలికల శిబిరంలో కూడా, 9 మంది శిబిరవాసుల బృందాలు, ముగ్గురు బృందనాయకుల (పెద్దల)తో, కుటుంబ-భావన కలిగేలా, రోజుకు మూడుసార్లు కలిసి భోజనం చేసేవారు. యోగశాస్త్ర సూత్రాలను అనుసరిస్తూ, ఒకరికొకరు వడ్డించుకుంటూ, మౌనంగా భోజనం చేసి, ఆ తరువాత శుభ్రపరచడంలో సహాయం చేసేవారు.

కుటుంబ శైలి భోజనాలలో, రుచికరమైన ఆహారాన్ని మౌనంలో ఆనందిస్తున్న బాలికలు.
భోజనాలలో ఒకరికొకరు సేవ చేయడం నేర్చుకుని, దాని ద్వారా స్నేహబంధాలను ఏర్పరుచుకోవడం

సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక వేడుకలు

సాంస్కృతిక కార్యక్రమం

శిబిరం చివరి రోజున బాలికలు, అద్భుతంగా రూపొందించబడిన సాంస్కృతిక కార్యక్రమాన్ని ప్రదర్శించారు.

ఆధ్యాత్మిక మేళా

బాలుర శిబిరంలోని బృందనాయకులు భవిష్యత్తుకు చెందిన ఒక ద్వాపరయుగ సంబంధిత కార్యక్రమాన్ని సృష్టించగా, బాలికల శిబిరం, శిబిరవాసులను గత ద్వాపరయుగ కాలానికి, అనగా, కృష్ణభగవానుడి కాలానికి తీసుకొని వెళ్లారు. గోపికలలాగా వేషధారణ చేసిన శిబిరవాసులు చిన్న చిన్న ఆటలను ఆడి, చివరగా భక్తిపూర్వకంగా, ఆనందభరితంగా ప్రదర్శించబడిన రాసలీల ఘట్టంతో కార్యక్రమాన్ని ముగించారు..

అభిప్రాయాలు

para-ornament

ముగింపు కార్యక్రమానికి విచ్చేసిన ప్రత్యేక అతిథి

బాలురు మరియు బాలికలు, రెండు శిబిరాల ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వై.ఎస్.ఎస్. సీనియర్ సన్యాసి అయిన స్వామి స్మరణానంద విచ్చేశారు. వై.ఎస్.ఎస్. బాలలు మరియు కౌమారుల రెండు శిబిరాలను ఏకకాకంలో విజయవంతంగా నిర్వహించడానికి తమ విశ్వవిద్యాలయాన్ని, దాని వివిధ సదుపాయాలను, సిబ్బంది సహకారాన్ని అందించినందుకు గాను, యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా తరఫున ఆయన ఖోస్లా కుటుంబాన్ని సత్కరించి, వారికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలిపారు.

ముగింపు కార్యక్రమంలో శిబిరవాసులను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ, భగవంతుడు వారికిచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని, సంతోషకరమైన మరియు విజయవంతమైన జీవితాలను గడపాలని వారిని ప్రోత్సహించే వీడ్కోలు సందేశంతో వారికి ప్రేరణనిచ్చారు. స్వామి స్మరణానంద,ఒక ఆపిల్ గింజను పైకిత్తి చూపిస్తూ, ఒక చిన్న గింజ ఎలాగైతే ఎన్నో పండ్లను ఇచ్చే మహావృక్షంగా ఎదుగుతుందో, అలాగే వారి జీవితాలు కూడా తమకు మరియు సమాజానికి ప్రయోజనకరంగా ఉండాలని శిబిరంలో పాల్గొన్నవారికి చెప్పారు.

ఖోస్లా కుటుంబాన్ని సత్కరించి...
...తమ ముగింపు ప్రసంగంతో శిబిరవాసులకు ప్రేరణనిచ్చిన స్వామి స్మరణానంద

గురుదేవుల రక్షణా ఛత్రం

శిబిరాల ప్రారంభానికి ముందురోజుల్లో, సోలన్ పట్టణంలోవాతావరణం వెచ్చగా ఉండడమే కాక, దూరంగా కార్చిచ్చులు కూడా కనిపించాయి. శిబిరాల ప్రారంభం రోజున, మేఘాలు, వర్షం మరియు చల్లనిగాలుల రూపంలో గురుదేవుల రక్షణ ఛత్రం ఆ ప్రాంతాలపైన వ్యాపించింది. వారమంతా అడపాదడపా జల్లులతో మరియు మేఘావృతమైన ఆకాశంతో, కార్యక్రమాలు ఆహ్లాదకరమైన వాతావరణంలో కొనసాగాయి. ఆశ్చర్యకరంగా, శిబిరాలు ముగిసిన మరుసటిరోజు సూర్యుడు మళ్లీ ప్రకాశవంతంగా ఉదయించాడు!

ఆధునిక సౌకర్యాలతో కూడిన అందమైన హిమాలయ విశ్వవిద్యాల ప్రాంగణంలో జరిగిన ఈ చారిత్రాత్మకమైన వై.ఎస్.ఎస్. శిబిరం, వాలంటీర్లు మరియు బృందనాయకుల సహకారం వల్ల మరియు మహాగురువుల ప్రత్యక్ష మరియు పరోక్ష అనుగ్రహాల వల్ల సాధ్యమయ్యింది.

శిబిరవాసుల కృతజ్ఞతా భావం ఈ క్రిందనున్న చిత్రంలో వెల్లడవుతోంది; ఇందులో బాలికలు, ఇలా వ్రాసి ఉన్న ఒక ఫలకాన్ని చూపిస్తున్నారు: “భగవంతుడితో సమస్తమూ సాధ్యమే!”

para-ornament

ఇతరులతో పంచుకోండి