సెప్టెంబర్ 1, 2025న, వై.ఎస్.ఎస్. సన్యాసులు స్వామి ఈశ్వరానంద గిరి మరియు స్వామి ధైర్యానంద గిరి డెహ్రాడూన్‌లో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి శ్రీ పుష్కర్ సింగ్ ధామీని కలిసి, రాష్ట్రంలో కొనసాగుతున్న వరద సహాయక చర్యలకు తోడ్పాటుగా ముఖ్యమంత్రి సహాయ నిధికి ₹25 లక్షల చెక్కును అందించారు.
వై.ఎస్.ఎస్. సన్యాసులకు ముఖ్యమంత్రి సాదరంగా స్వాగతం పలికి, వారికి కండువాలు కప్పి, రాష్ట్రంలో కొనసాగుతున్న సహాయక చర్యల వివరాలను తెలియజేశారు. బాధితులను సకాలంలో ఆదుకున్న వై.ఎస్.ఎస్. కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సమావేశంలో వై.ఎస్.ఎస్. వ్యవస్థాపకులు శ్రీ శ్రీ పరమహంస యోగానందగారి ఆధ్యాత్మిక వారసత్వం నుండి వచ్చిన పుస్తకాలను స్వామి ఈశ్వరానంద శ్రీ ధామీకి బహూకరించారు.


ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి శ్రీ పుష్కర్ సింగ్ ధామీని కలిసిన వై.ఎస్.ఎస్. సన్యాసులు
ఈ సమర్పణ పరమహంస యోగానందగారి ఆదర్శాల పట్ల వై.ఎస్.ఎస్. కి ఉన్న నిరంతర నిబద్ధతను ప్రతిబింబిస్తుంది: “ఇతరులకు ఆధ్యాత్మిక, మానసిక మరియు భౌతిక సేవ చేయడం ద్వారా, మీరు మీ స్వంత అవసరాలు నెరవేరుతున్నట్లు కనుగొంటారు. మీరు ఇతరులకు సేవ చేయడంలో మిమ్మల్ని మీరు మరచిపోయినప్పుడు, దానిని కోరకుండానే, మీ స్వంత ఆనందం యొక్క పాత్ర నిండుతుందని మీరు కనుగొంటారు.”
ఈ దృక్పథం యొక్క మార్గనిర్దేశంలో, వై.ఎస్.ఎస్. తన ఆశ్రమాలు, కేంద్రాలు మరియు మండళ్ళ ద్వారా భారతదేశం మంతటా పేదలకు సేవ చేస్తోంది.
వై.ఎస్.ఎస్. సహాయ కార్యక్రమాలకు మీరు సహకరించాలనుకుంటే, దయచేసి దిగువ ఇచ్చిన లింక్‌ని సందర్శించండి: