స్వామి శ్రీయుక్తేశ్వర్ గారి ఆవిర్భావ
దినోత్సవ స్మారక కార్యక్రమాలు

వై.ఎస్.ఎస్. ఓ.డి.కె. స్వామి శ్రీయుక్తేశ్వర్ ఆవిర్భావ దినోత్సవ స్మారక కార్యక్రమాలు — మే 2026

ఈ కార్యక్రమం గురించి

నేను నా గురుదేవులు స్వామి శ్రీయుక్తేశ్వర్ గారికి సర్వదా ఋణపడి ఉన్నాను; ఆయన అన్ని విధాలా పరిపూర్ణులు. ఆయన జ్ఞానాన్ని అనుసరించడం వల్లనే నేను నా లక్ష్య సాధనలో విజయం సాధించగలిగాను….

— శ్రీ శ్రీ పరమహంస యోగానంద

పరమహంస యోగానంద గారి గురుదేవులు మరియు వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. భక్తులకు పరమగురుదేవులు, జ్ఞానావతారులు లేక “జ్ఞానం యొక్క అవతారం” గా గౌరవించబడే స్వామి శ్రీయుక్తేశ్వర్ గారి ఆవిర్భావ దినోత్సవాన్ని (జయంతి వార్షికోత్సవం) మే 10వ తేదీన మనం జరుపుకుంటాం.

ఈ పవిత్ర సందర్భంలో, మే నెలలో మనం నిర్వహించుకొనే రెండు ప్రత్యేక కార్యక్రమాలలో పాల్గొనేందుకు మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం.

స్వామి శ్రీయుక్తేశ్వర్ గిరి గారి గౌరవార్ధం
మూడు-గంటల స్మారకోత్సవ ధ్యానం

ఆదివారం, మే 3, 2026
ఉదయం 6:10 – ఉదయం 9:30 (భారతీయ కాలమానం ప్రకారం)

మే 3న ఒక వై.ఎస్.ఎస్. సన్యాసి నిర్వహించే మూడు-గంటల ధ్యానంతో స్వామి శ్రీయుక్తేశ్వర్ గారిని మనం గౌరవించుకుంటాం. ఈ కార్యక్రమంలో నియమిత సమయాల పాటు కీర్తనగానం, ధ్యానం మరియు స్ఫుర్తిదాయక పఠనం ఉంటాయి.

దయచేసి గమనించండి: ఈ కార్యక్రమం మంగళవారం మే 5, రాత్రి 10 (భారతీయ కాలమానం ప్రకారం) వరకు వీక్షించడానికి అందుబాటులో ఉంటుంది.

స్వామి శ్రీయుక్తేశ్వర్ గిరి గారి ఆవిర్భావ
దినోత్సవ స్మారక ధ్యానం

ఆదివారం, మే 10, 2026
ఉదయం 6:30 – ఉదయం 8:00 (భారతీయ కాలమానం ప్రకారం)

స్వామి శ్రీయుక్తేశ్వర్ గారి ఆవిర్భావ దినోత్సవమైన మే 10న, మహోన్నతులైన ఆ జ్ఞానావతారులను ఒక వై.ఎస్.ఎస్. సన్యాసి నిర్వహించే ఒక స్మారకోత్సవ ఆన్‌లైన్ ధ్యానంతో గౌరవించుకుంటాం.

దయచేసి గమనించండి: ఈ కార్యక్రమం సోమవారం మే 11, రాత్రి 10 (భారతీయ కాలమానం ప్రకారం) వరకు వీక్షించడానికి అందుబాటులో ఉంటుంది.

ఈ స్మారకోత్సవ ధ్యాన కార్యక్రమాలలో పాల్గొనేందుకు అందరికీ స్వాగతం.

ఈ ప్రత్యేక సందర్భాన్ని వై.ఎస్.ఎస్. ఆశ్రమాలు, కేంద్రాలు మరియు మండళ్ళు కూడా వ్యక్తిగతంగా పాల్గొనే కార్యక్రమాలతో జరుపుకుంటాయి. ఈ కార్యక్రమాల గురించి మరింతగా తెలుసుకొనేందుకు మరియు పాల్గొనేందుకు, దయచేసి మీకు దగ్గరలోని ధ్యాన కేంద్రమును సంప్రదించండి.

ఈ పవిత్ర సందర్భంలో, వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. గురు పరంపర ద్వారా క్రియాయోగ మార్గంలో తమకు లభించిన ఆశీస్సులకు కృతజ్ఞతగా భక్తులు ప్రణామి సమర్పిస్తారు.

ఈ ఆత్మ-విముక్తి బోధనలను చిత్తశుద్ధిగల అన్వేషకులందరికీ అందజేసేందుకు వై.ఎస్.ఎస్. చేస్తున్న కృషికి మీరు సహకరించాలనుకొంటే, క్రింద పంచుకొన్న లింక్ ద్వారా మీరు అలా చేయవలసిందిగా మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం.

నూతన సందర్శకులు

వై.ఎస్.ఎస్. కు మరియు పరమహంస యోగానందగారి బోధనలకు కొత్తవారైతే, క్రింద ఉన్న లింక్ లను అన్వేషించడానికి ఇష్టపడవచ్చు:

ఒక యోగి ఆత్మకథ

ఒక అత్యుత్తమ ఆధ్యాత్మిక రచనగా ప్రపంచవ్యాప్తంగా ప్రశంసించబడుతున్న తమ పుస్తకం గురించి పరమహంసగారు తరచుగా, “నేను లేనప్పుడు ఈ పుస్తకం నా దూత అవుతుంది,” అనే వారు.

వై.ఎస్.ఎస్. పాఠాలు

మీరు ఊహించని విధంగా మీ జీవితాన్ని మార్చడానికి, సమతుల్యతను సాధించటానికి మరియు విజయవంతమైన జీవితాన్ని గడపడానికి మీకు సహాయపడే గృహ-అధ్యయన పాఠ్యక్రమం.

ఇతరులతో పంచుకోండి