క్రియాయోగ అమర గురువులు: మహావతార్ బాబాజీ

పరమహంస యోగానందగారు వ్రాసిన విశ్వవిఖ్యాత ఆధ్యాత్మిక మహాకావ్యమైన ఒకయోగిఆత్మకథ లో ప్రస్తావించబడిన అద్భుతయోగి మహావతార్ బాబాజీ ఎవరు? బదరీనారాయణ క్షేత్రానికి సమీపంలో ఉత్తర హిమాలయ పర్వత ప్రాంతాలలో ఉండే అమర గురువులుగా పరిచయం చేయబడిన బాబాజీ ఒక మహావతార్ గా వర్ణించబడ్డారు, జనన మరణచక్రం నుండి సంపూర్ణంగా విముక్తి పొంది, మానవాళిని ఆధ్యాత్మికంగా ఉద్ధరించడం కోసం సహస్రాబ్దులుగా ఒక తేజోవంతమైన యువశరీరాన్ని ధరించిన దైవ అవతారం. బాబాజీని కలిసినవారు, నిర్మలమైన ప్రేమ ఆయన స్వభావమని, వినమ్రత ఆయన ప్రత్యేక గుణమని చెబుతారు. ఆయన పవిత్రనామాన్ని భక్తితో పలికినట్లయితే, తక్షణమే అనుగ్రహం లభిస్తుందని చెబుతారు.


యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా (వై.ఎస్.ఎస్.) యొక్క సీనియర్ సన్యాసి స్వామి స్మరణానంద గిరి గారి ఈ ఆంగ్ల ప్రసంగం ద్వారా మహావతార్ బాబాజీ గురించి మరింతగా తెలుసుకోవాలని మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. భగవత్-సాక్షాత్కారాన్ని కలిగించే పవిత్ర, శాస్త్రీయ ప్రక్రియ అయిన క్రియాయోగం ఒక అవిచ్ఛిన్న గురు-శిష్య పరంపర ద్వారా – బాబాజీ నుంచి లాహిరీ మహాశయులకు, ఆపై స్వామి శ్రీ యుక్తేశ్వర్ గారికి, చివరకు ఆయన నుంచి పరమహంస యోగానంద గారికి – ఎలా అందించబడిందో తెలుసుకోండి. ఈ బోధనలను పాశ్చాత్యదేశాలకు తీసుకొని వెళ్లవలసినదిగా 1920లో బాబాజీ పరమహంస యోగానంద గారిని స్వయంగా ఆదేశించారు.


ఈ ప్రసంగం అయిదు ఇతర భాషలలొ కూడా అందుబాటులో ఉంది: ఇంగ్లీష్, హిందీ, బెంగాలీ, కన్నడ, మరియు తమిళం

para-ornament

పరమహంస యోగానందగారు స్థాపించిన యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా యొక్క ఆధ్యాత్మిక మరియు మానవతా కార్యకలాపాలకు మీరు మద్దతు ఇవ్వాలనుకుంటే, క్రింద ఉన్న బటన్‌ను క్లిక్ చేయడం ద్వారా మీరు విరాళం ఇవ్వవచ్చు:

ఈ పేజీకి కొత్త సందర్శకులు

పరమహంస యోగానందగారు మరియు ఆయన బోధనల గురించి మరింత తెలుసుకోవడానికి మీరు ఈ క్రింది కథనాలను కూడా అన్వేషించవచ్చు.

ఇతరులతో పంచుకోండి