
మొట్టమొదటి యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా (వై.ఎస్.ఎస్.) యూత్ సర్వీసెస్ వాలంటీర్ కార్యశాల మే 1 నుండి 4, 2025 వరకు వై.ఎస్.ఎస్. నోయిడా ఆశ్రమంలో జరిగింది. ఈ సందర్భంగా, అనుభవజ్ఞులైన వాలంటీర్లు మరియు కొత్తగా సేవ చేయడానికి ప్రేరణ పొందిన వారితో కలిపి, 125 మంది భక్తులు ఒకచోట చేరారు. వీరు అన్ని వై.ఎస్.ఎస్. ఆశ్రమాల నుండి, మరియు భారతదేశం అంతటా ఉన్న 40కి పైగా కేంద్రాల నుండి వచ్చి పాల్గొన్నారు.
వై.ఎస్.ఎస్. సన్యాసులచే మార్గ నిర్దేశం చేయబడిన ఈ నాలుగు-రోజుల కార్యశాల, యువజన సేవల విభాగం యొక్క దర్శనము మరియు లక్ష్యాల చుట్టూ వాలంటీర్లను ఏకం చేయడం, మరియు పిల్లలు, యుక్తవయస్కులు మరియు యువ సాధకులకు (18 నుండి 35 సంవత్సరాల వయస్సు) సేవ చేయడంలో వారికి శిక్షణ ఇవ్వడం లక్ష్యంగా పెట్టుకుంది — ఇవి అన్నీ పరమహంస యోగానంద గారి బోధనలపై కేంద్రీకృతమై జరిగాయి.
“ఇది ఒక ప్రత్యేకమైన శిక్షణ. అంతేకాక, మీరు మీ సాధనను, మరియు భగవంతునితో మరియు గురువుతో మీ అనుసంధానాన్ని మరింత గాఢం చేసుకోడానికి సహాయపడే ఒక్క శిక్షణా కార్యక్రమానికి హాజరు కావాలనుకుంటే, ఇది మీకు సహాయపడుతుంది!”
—కె.ఎం., మహారాష్ట్ర





వై.ఎస్.ఎస్. సన్యాసులు మరియు అనుభవజ్ఞులైన వాలంటీర్లు శిక్షణా సమావేశాలకు నాయకత్వం వహించి, పాల్గొనేవారికి మార్గదర్శకత్వం చేసారు. వారు కొత్తగా ఏర్పడిన ఈ విభాగంలోని ఐదు శాఖలలో అందుబాటులో ఉన్న వివిధ సేవా అవకాశాలను కూడా పరిచయం చేశారు:
- సంఘం మరియు కమ్యూనికేషన్,
- శిక్షణ మరియు విషయం (content),
- కార్యక్రమాలు మరియు కార్యకరణ (operations),
- వై.ఎస్.ఎస్. కేంద్రాలలో యువజన సేవా కార్యక్రమాల అభివృద్ధి, మరియు
- వాలంటీర్ల సమన్వయం.
“మరింత ఉత్సాహభరితంగా, అర్థవంతంగా, ఆనందదాయకంగా, మరియు పిల్లలకు ఉపయోగకరంగా ఉండేలా గురుదేవుల బోధనలను ప్రతి సమావేశంలో ఎలా సమగ్రపరచాలో నేర్చుకునే అద్భుతమైన అవకాశం ఇది.”
—ఎస్. ఎన్., ఝార్ఖండ్
ఒక సమతుల్య కార్యక్రమం
మొదటి రోజున మూడు గంటల ధ్యానం మరియు మూడుసార్లు రోజువారీ సమూహ ధ్యానాలు, మనస్సును నిర్మలంగా మరియు ఆ రోజు యొక్క కార్యకలాపాలకు గ్రహణశీలంగా సిద్ధం చేసాయి.
భక్తుని యొక్క ఆధ్యాత్మిక జీవితానికి సాధన మరియు సేవలను సమతుల్యం చేయడం చాలా అవసరమని, మరియు ఈ సమతుల్యమైన జీవనం తాము సేవ చేసే యువతకు శక్తివంతమైన ఉదాహరణగా నిలుస్తుందనీ, పాల్గొన్నవారు తెలుసుకున్నారు.

రెండు అభ్యాస శాఖలు: పిల్లల సత్సంగం మరియు యువ (టీనేజ్) సత్సంగం వారికి వేరు వేరుగా.
ఈ కార్యశాల రెండు ప్రత్యేకమైన అభ్యాస శాఖలను ఏర్పాటు చేసింది — ఇవి పిల్లల సత్సంగ (CS) మరియు యువజన (టీనేజ్) సత్సంగ (TS); పాల్గొనే వారి ఆసక్తి మరియు పూర్వ అనుభవం ప్రకారం ఈ రెండు సమూహాలు ఏర్పాటు చేయబడ్డాయి.
పాల్గొన్న వారి మధ్య దాపరికంలేని సంభాషణలను మరియు లోతైన అనుబంధాన్ని ప్రోత్సహించే విధంగా వాలంటీర్లు ఆలోచనాత్మకంగా ఈ రెండు శాఖలలోనూ సమూహం చేయబడ్డారు. ప్రభావశీలమైన సత్సంగం యొక్క ప్రధాన సూత్రాలను – సత్సంగ సమయాన్ని దేవుని పై కేంద్రీకరించడం, గురుదేవుని బోధనల స్వచ్ఛతను కాపాడుకోవడం మరియు ప్రేమ, ఆనందం మరియు కృతజ్ఞతా భావాన్ని వ్యక్త పరచడం – ఈ శిక్షణా కార్యక్రమం నేర్పింది.
ఆధ్యాత్మికతను పెంపొందించే సృజనాత్మకమైన విధానాల ద్వారా పిల్లలను, యువజనులను (6–17 సంవత్సరాల వయసు) ఆకట్టుకొనే ఉత్తమ అభ్యాసాలను వాలంటీర్లు పంచుకున్నారు. ఇందులోని ముఖ్యాంశాలు: కథలు చెప్పే ప్రత్యక్ష ప్రదర్శనలు, ధ్యానాలు నిర్వహించడంలో ఆచరణాత్మక మార్గదర్శకత్వం మరియు సమావేశాలు రూపొందించడంలో ఆచరణాత్మకమైన అభ్యాసాలు ఉన్నాయి – ఇవి అన్నీ యువ మనస్సులు మరియు హృదయాల అవసరాలకు అనుగుణమైనవి.


“సమావేశానికి సిద్ధం కావడానికి ఈ ప్రధాన సూత్రాలు నిజంగా విలువైనవి; మరియు ‘ప్రేమ మరియు కృతజ్ఞతా భావం’ పై దృష్టి పెట్టడం అద్భుతం. నిజానికి, మొత్తం శిక్షణ చాలా చక్కగా నిర్వహించబడింది. ఈ ప్రయత్నానికి నిజమైన కృతజ్ఞతలు. దీన్ని సాధ్యం చేయడంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.”
—ఎస్. ఎల్., తమిళనాడు
“గురుదేవుల బోధనలను సమీకరించడానికి మరియు దానిని పిల్లల సత్సంగ సమావేశంలో మరింత ప్రభావయుక్తంగా అందించడానికి మాకు నియుక్తమైన మార్గంలో సహాయపడే విధంగా సమావేశంలోని ప్రతి భాగం గురించి మరింత ఆలోచించడానికి ఇది మాకు మెరుగైన అవకాశాన్ని ఇచ్చింది.”
—ఎస్. ఎస్., పశ్చిమ బెంగాల్

“‘ధ్యానసాధనను ఆసక్తికరంగా మరియు ఆకర్షణీయంగా చేయడం’ అనే సెషన్ అద్భుతంగా ఉంది! పిల్లల కోసం ధ్యానాన్ని నడిపించడానికి ఇది ఒక అద్భుతమైన ఉదాహరణ.”
—ఎన్.పి., ఉత్తరప్రదేశ్
యువజన సేవల విభాగంలో సేవలందించడానికి మార్గదర్శక సూత్రాలు
కార్యశాల ముగింపు సమయంలో, స్వామి శంకరానంద మరియు అనుభవజ్ఞులైన వాలంటీర్లు, సురక్షితమైన, మరియు ఆధ్యాత్మికతను పెంపొందించే వాతావరణంలో, పిల్లలు మరియు యుక్తవయస్కులు భగవంతుని పట్ల వారి ప్రేమను పెంచుకునేటట్లు యువజన కార్యక్రమాలను నిర్వహించడంలో కీలకమైన మార్గదర్శక సూత్రాలను పంచుకున్నారు.
యువజన సేవల విభాగంలోని ఐదు విభాగాలను అన్వేషించడంలో పాల్గొనేవారికి సహాయం చేయడానికి మరియు వారు అత్యంత ప్రేరణ పొందిన చోట సేవ చేయడంలో తమ ఆసక్తిని నమోదు చేసుకోవడానికి వాలంటీర్ సర్వీస్ అవకాశాల కేంద్రం కూడా ఏర్పాటు చేయబడింది.


శిక్షణను ఇంటికి తీసుకెళ్లడం
వాలంటీర్లు తమ నగరాలకు తిరిగి వెళ్ళిన తర్వాత యువతతో సంపర్కాన్ని బలోపేతం చేయడానికి తీసుకోగల తదుపరి చర్యలను ఆఖరి రోజు వివరించారు. సామరస్య పూర్వకంగా కలసి పనిచెయ్యడం ద్వారా స్థానిక కేంద్రాలలో యువజన సేవలను అభివృద్ధి చేసి, పెంపొందించుకునే ఉత్తమ పద్ధతులు వివరించబడ్డాయి.
పిల్లలను ఆధ్యాత్మికంగా పెంచడంపై, మరియు యువకుల ఆత్మలను దివ్య ఆదర్శాల వెలుగులో నడిపించే పవిత్ర బాధ్యతపై జ్ఞానాన్ని స్వామి స్మరణానంద గిరి తమ ముగింపు సత్సంగంలో అందించారు.
నూతనంగా ఏర్పాటైన యువజన సేవల విభాగం విజయానికి దైవానుగ్రహాన్ని కోరుతూ సామూహిక కీర్తన, మరియు దివ్యసంకల్పంతో ఈ కార్యశాల ముగిసింది.

“ఇది ఒక ప్రత్యేకమైన శిక్షణ. అంతేకాక, మీరు మీ సాధనను, మరియు భగవంతునితో మరియు గురువుతో మీ అనుసంధానాన్ని మరింత గాఢం చేసుకోడానికి సహాయపడే ఒక్క శిక్షణా కార్యక్రమానికి హాజరు కావాలనుకుంటే, ఇది మీకు సహాయపడుతుంది!”
—కె.ఎం., మహారాష్ట్ర
ఆత్మసాక్షాత్కార మార్గంలో యువకులను మార్గనిర్దేశం చేయడానికి తమ హృదయాలను మరియు మనస్సులను మెరుగ్గా సిద్ధం చేసే దైవకృప కలిగిన ఈ శిక్షణా అవకాశం, మరియు అభ్యాసానుభవం పొందిన వాలంటీర్లు తమ ప్రశంసలను వ్యక్తం చేశారు.
“ఇంత చక్కగా ప్రణాళికాబద్ధమైన మరియు ఆలోచనాత్మకమైన కార్యశాల... ఇది నిజంగా మన గురదేవుల పని విధానాన్ని సూచిస్తుంది. వై.ఎస్.ఎస్. సభ్యుల గురించి, మన చిన్న పిల్లల గురించి గురుదేవులు ఎంతగా ఆలోచిస్తారో. తమ హృదయానికి ఎంతో ప్రియమైన పనికి దివ్య సాధనాలుగా గురువు మనల్ని ఎన్నుకున్నందుకు మనం ధన్యులం. ఈ అద్భుతమైన కార్యశాలను నిర్వహించినందుకు సన్యాసులు మరియు వాలంటీర్లు అందరికీ కృతజ్ఞతలు. శిక్షణ నుండి ఆహారం వరకు ప్రతి విషయం ఖచ్చితంగా ఉంది. ఈ అద్భుతమైన కార్యశాలలో భాగమై నందుకు చాలా సంతోషంగా ఉంది. గుండె నిండుగా ఉంది.”
—పి. ఎస్., తమిళనాడు
తదుపరి దశలు
- యువజన సేవల విభాగం కోసం వాలంటీర్ చేసి భవిష్యత్ శిక్షణా శిబిరాలలో పాల్గొనాలనుకునే వారు [email protected] వద్ద మమ్మల్ని సంప్రదించడానికి స్వాగతం.
- 2025 చివరలో దేశవ్యాప్తంగా ఆన్‌లైన్ యువ సత్సంగ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు సన్నాహకంగా యువ సత్సంగ వాలంటీర్ల కోసం ఆన్‌లైన్ శిక్షణా కార్యక్రమం జూలై-ఆగస్టులో నిర్వహించబడుతుంది.
- అదనపు ప్రాథమిక శిక్షణ మరియు దోహదకారుల నైపుణ్య-అభివృద్ధి కార్యశాలలు ఈ సంవత్సరం చివరి భాగంలో నిర్వహించబడతాయి.
యువజన సేవల సౌకర్య-కర్తలుగా శిక్షణ పొందేందుకు ఆసక్తి ఉన్నవారు, భవిష్యత్ శిక్షణా శిబిరాలలో చేరడానికి ఈ ఫారాన్ని పూరించవచ్చు.
గురుదేవుల మార్గదర్శకత్వంలో ఈ పవిత్రమైన కార్యాన్ని కలిసి కొనసాగించడానికి ఎదురు చూస్తున్నాము.