యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా నుండి ముఖ్యమైన ప్రకటనలు

దయచేసి దిగువ మా వివరణాత్మక ప్రకటనలను చదవండి. ప్రస్తుత పరిస్థితులు మరియు అందుబాటులో ఉన్న సేవల సారాంశం:

సవరణ: మే 16, 2022

రాంచీ, దక్షిణేశ్వర్, ద్వారహట్, మరియు నోయిడా లోని వై.ఎస్.ఎస్. ఆశ్రమాలలో ఇప్పుడు వసతి సదుపాయం అందుబాటులో ఉందని మీకు తెలియజేయడానికి మేము సంతోషిస్తున్నాము. మీ బసను బుక్ చేసుకోవడానికి, దయచేసి ఈ ఆశ్రమాలను నేరుగా సంప్రదించండి.

అందరూ ఆహ్వానితులే.

అందుబాటులో ఉన్న ఆన్‌లైన్ సేవలు

ఈ క్రింది వాటిలో పాల్గొని ప్రయోజనం పొందాలని మేము మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాము:

ఇంగ్లీషులో యోగదా సత్సంగ పాఠాల కోసం ఇంకా నమోదు చేసుకోని వారు మా ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్ ద్వారా నమోదు చేసుకోవచ్చు. అప్లికేషన్ ప్రాసెస్ చేయబడిన వెంటనే మీరు వాటిని వై.ఎస్.ఎస్. పాఠాలు యాప్‌లో డిజిటల్‌గా స్వీకరించడం ప్రారంభిస్తారు.

para-ornament

సవరణ: మార్చి 31, 2022

  • వై.ఎస్.ఎస్. ఆశ్రమాలు, కేంద్రాలు, మండలాలు మరియు రిట్రీట్ సెంటర్‌లలో సమూహ ధ్యానాలు ఇప్పుడు పునః ప్రారంభించబడ్డాయి. అందరికీ స్వాగతం.

భక్తులకు ఏవైనా సందేహాలు ఉంటే, వారు వై.ఎస్.ఎస్. రాంచీ హెల్ప్ డెస్క్ ద్వారా సంప్రదించవచ్చు [email protected] లేదా phone: +91 (651) 6655 555
(సోమ – శని ఉ 9:00 – సా 4:30).

para-ornament

సవరణ: జనవరి 15, 2021

హరిద్వార్ కుంభమేళా – 2021

  • ప్రస్తుత మహమ్మారి పరిస్థితి కారణంగా 2021లో జరిగే కుంభమేళాలో శిబిరాన్ని నిర్వహించాలని వై.ఎస్.ఎస్. ప్లాన్ చేయలేదు
para-ornament

సవరణ: సెప్టెంబర్ 5, 2020

  • డిసెంబర్ వరకు అన్ని సాధనా సంగాలు మరియు సన్యాసుల పర్యటనలు రద్దు చేయబడ్డాయి.
para-ornament

సవరణ: జూన్ 15, 2020

  • సెప్టెంబర్ చివరి వరకు అన్ని సాధనా సంగాలు మరియు సన్యాసుల పర్యటనలు రద్దు చేయబడ్డాయి.
para-ornament

సవరణ: ఏప్రిల్ 15, 2020

ప్రభుత్వం లాక్‌డౌన్‌ను పొడిగించిన నేపథ్యంలో, గతంలో రద్దు ప్రకటించిన వన్నీ తదుపరి నోటీసు వచ్చే వరకు ఇంకా పొడిగించబడ్డాయి. కాబట్టి, తదుపరి నోటీసు వరకు:

  • వై.ఎస్.ఎస్. ఆశ్రమాలు, కేంద్రాలు, మండలిలు, మరియు రిట్రీట్ సెంటర్‌లలో ఏ సమూహ కార్యకలాపాలు నిర్వహించబడవు.
  • సాధన సంగమాలు (మే), స్వామీజీల పర్యటనలు మరియు రిట్రీట్లతో సహా అన్ని కార్యక్రమాలు మే 10 వరకు రద్దు చేయబడ్డాయి. మే 10 తర్వాత కార్యక్రమాలుకు సంబంధించిన సమాచారం తర్వాత తేదీలో పోస్ట్ చేయబడుతుంది.
  • భక్తులు ఏవైనా వై.ఎస్.ఎస్. ఆశ్రమాలు మరియు రిట్రీట్ సెంటర్‌లను సందర్శించడానికి మరియు బస చేయడానికి చేసుకున్న ప్రణాళికలు ఏమైనా ఉంటే వాటిని రద్దు చేసుకోవాలని అభ్యర్ధిస్తున్నాము.

భక్తులు srfonlinemeditation.org లో ఆన్‌లైన్ సమూహ ధ్యానాలలో పాల్గొనడం కొనసాగించవచ్చు, ఇక్కడ వై.ఎస్.ఎస్. సన్యాసులు ఇప్పుడు ఆదివారాలు (6:10 am నుండి 9:30 am IST వరకు) ఉదయం సుదీర్ఘ ధ్యానం మరియు సోమ, గురువారాల్లో (5:10-6.30) సాయంత్రం ధ్యానంలో పాల్గొంటారు. సాయంత్రం 6:30 IST వరకు). మరింత తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

ఏప్రిల్ 16, 2020న ధ్యానం హిందీలో నిర్వహించబడుతుంది. ప్రారంభ మరియు ముగింపు ప్రార్థన మరియు రోగ నివారక సేవ హిందీలో ఉంటుంది, చదవడం మరియు పఠించడం హిందీ మరియు ఆంగ్లం రెండింటిలోనూ ఉంటుంది.

para-ornament

సవరణ: ఏప్రిల్ 6, 2020

మే 10 వరకు కార్యక్రమాల రద్దు: మే 10 వరకు అన్ని వై.ఎస్.ఎస్. సన్యాసుల పర్యటనలు మరియు రిట్రీట్‌లు రద్దు చేయబడినట్లు మేము మీకు తెలియజేస్తున్నాము. వీటిలో సిమ్లాలోని సాధన సంగమం, కేరళకు సన్యాసుల పర్యటన కార్యక్రమం మరియు నోయిడా ఆశ్రమంలో రిట్రీట్ ఉన్నాయి.

para-ornament

సవరణ: ఏప్రిల్ 2, 2020

వై.ఎస్.ఎస్. పాఠాలు డిజిటల్ రూపంలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి

భారతదేశం అంతటా ఝార్ఖండ్ మరియు ఇతర రాష్ట్రాలలో లాక్డౌన్ ఫలితంగా, మేము తాత్కాలికంగా యోగదా సత్సంగ పాఠాలు మరియు అన్ని ఇతర భౌతిక ప్రచురణలు మరియు ఉత్పత్తులతో సహా ముద్రించిన మెయిలింగ్‌లను పంపలేకపోతున్నాము. అయితే, ఈ సమయంలో, Apple (iOS) మరియు ఆండ్రాయిడ్ పరికరాల కోసం అందుబాటులో ఉన్న యాప్ ద్వారా డిజిటల్ రూపంలో వై.ఎస్.ఎస్. విద్యార్థులకు యోగదా సత్సంగ పాఠాలు ఆంగ్ల భాషా ఎడిషన్‌ను అందించడం కొనసాగిస్తాము.

దీని అర్థం మీరు మా రెగ్యులర్ షెడ్యూల్ ప్రకారం కొత్త పాఠాలను స్వీకరించగలరు మరియు మీ డిజిటల్ పరికరంలో వాటిని చదవగలరు మరియు అధ్యయనం చేయగలరు. మీరు ప్రతి పాఠంతో పాటుగా ఉన్న విలువైన సహాయక మెటీరియల్‌ని కూడా యాక్సెస్ చేయగలరు.

మేము మెయిలింగ్‌లను పునః ప్రారంభించగలిగినప్పుడు మీరు డిజిటల్ రూపంలో స్వీకరించిన అన్ని పాఠాలు ముద్రిత రూపంలో మీకు మెయిల్ చేయబడతాయి. సాధారణ పరిస్థితుల్లో, ఆధ్యాత్మిక అధ్యయనానికి మీ ప్రాథమిక మూలాధారంగా ముద్రిత పాఠాలను ఉపయోగించమని మేము మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాము. కానీ డిజిటల్ యాప్ మీరు తాత్కాలిక మూసివేత సమయంలో కూడా పాఠాలను అందుకోడానికి సాధ్యం చేస్తున్నందుకు మేము కృతజ్ఞులం.

ఈ పరీక్షా సమయంలో మీ అవగాహన మరియు సహకారాన్ని మేము ఎంతో అభినందిస్తున్నాము. మా ప్రార్థనలలో మేము మిమ్మల్ని తలచుకుంటున్నామని మరియు భగవంతుడు మరియు గొప్పవారు తమ నిత్యమైన దివ్య ప్రేమ మరియు రక్షణతో మిమ్మల్ని రక్షిస్తున్నారని దయచేసి తెలుసుకోండి.

వై.ఎస్.ఎస్. పాఠాల దరఖాస్తులు ఇంకా ప్రాసెస్ చేయబడుతున్నాయి

ఈ సమయంలో మేము ఎలాంటి ముద్రిత మెయిలింగ్‌లను పంపలేకపోతున్నాము, మేము వై.ఎస్.ఎస్. పాఠాల, కోసం కొత్త దరఖాస్తులను స్వీకరిస్తున్నాము మరియు మీరు దరఖాస్తు చేసుకోవడానిని స్వాగతిస్తున్నాము. ముద్రించిన పాఠాలను మళ్లీ పొస్ట్ చేసిన వెంటనే మేము మీకు తెలియజేస్తాము. అయితే, పైన పేర్కొన్న విధంగా, ఈ సమయంలో, ఇంగ్లీష్ పాఠాలను విద్యార్థులు వై.ఎస్.ఎస్. పాఠాలు యాప్‌లో చదవగలరు. పాఠాలు ప్రతి రెండు వారాలకు, విద్యార్థులు వీక్షించడానికి యాప్‌లో కొత్త పాఠాలు విడుదల చేయబడతాయి.

para-ornament

సవరణ: మార్చి 26, 2020

వై.ఎస్.ఎస్. పాఠాల మెయిలింగ్‌లు తాత్కాలికంగా ఆపబడ్డాయి

భారతదేశం అంతటా, ఝార్ఖండ్ మరియు ఇతర రాష్ట్రాలలో లాక్డౌన్ ఫలితంగా, మేము తాత్కాలికంగా యోగదా సత్సంగ పాఠాలు మరియు అన్ని ఇతర భౌతిక ప్రచురణలను — ఏ మెయిలింగ్‌లను పంపలేకపోతున్నాము. పాఠాలకు మీ ప్రస్తుత సబ్‌స్క్రిప్షన్ తాత్కాలికంగా నిలిపివేయబడింది మరియు మా కార్యక్రమాలు సాధారణ పరిస్థితులు వచ్చిన తర్వాత మెయిలింగ్‌లను పునః ప్రారంభించాలని మేము ఎదురుచూస్తున్నాము.

మేము ప్రస్తుతం ఈ పరిస్థితికి స్వల్పకాలిక పరిష్కారాలను అన్వేషిస్తున్నాము మరియు మీ అవసరాలను ఉత్తమంగా ఎలా అందించాలనే దానిపై మాకు స్పష్టమైన ఆలోచన వచ్చిన వెంటనే ప్రత్యామ్నాయాలను ప్రకటిస్తాము. ఈ మధ్యకాలంలో, మీరు ఇప్పటికే అందుకున్న పాఠాలను సమీక్షించడానికి, వై.ఎస్.ఎస్. ధ్యాన పద్ధతులను అభ్యసించడానికి మరియు భగవంతునితో మీ వ్యక్తిగత సంబంధాన్ని మరింతగా పెంచుకోవడానికి ఈ సమయాన్ని ఉపయోగించమని మేము మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాము. మీకు వై.ఎస్.ఎస్. ఈ-న్యూస్‌లెటర్‌కు సభ్యత్వం లేకుంటే కనుక, ఇప్పుడు పొందమని ప్రోత్సహిస్తున్నాము.

ఈ పరీక్షా సమయంలో మీ అవగాహన మరియు సహకారాన్ని మేము ఎంతో అభినందిస్తున్నాము. మా ప్రార్థనలలో మేము మిమ్మల్ని తలచుతున్నామని మరియు భగవంతుడు మరియు మహాత్ములు తమ నిత్యమైన దివ్య ప్రేమ మరియు రక్షణతో మిమ్మల్ని రక్షిస్తున్నారని దయచేసి తెలుసుకోండి.

వై.ఎస్.ఎస్. పాఠాల దరఖాస్తులు ఇంకా స్వీకరించబడుతున్నాయి

ఈ సమయంలో మేము ఎలాంటి ముద్రిత మెయిలింగ్‌లను పంపలేకపోతున్నాము, మేము వై.ఎస్.ఎస్. పాఠాల, కోసం కొత్త దరఖాస్తులను స్వీకరించబడం కొనసాగిస్తున్నాము మరియు మీరు దరఖాస్తు చేసుకోవడానికి స్వాగతిస్తున్నాము. ముద్రించిన పాఠాలను మళ్లీ పోస్ట్ చేసిన వెంటనే మేము మీకు తెలియజేస్తాము.

para-ornament

సవరణ: మార్చి 18, 2020

కరోనా వైరస్ వ్యాప్తి ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో, గతంలో ప్రకటించిన అన్ని రద్దులను ఏప్రిల్ 20, 2020 వరకు పొడిగించారు. కాబట్టి, ఏప్రిల్ 20, 2020 వరకు:

  • వై.ఎస్.ఎస్. ఆశ్రమాలు, కేంద్రాలు, మండలాలు మరియు రిట్రీట్ సెంటర్‌లలో జరగనున్న సమూహ కార్యకలాపాలు నిర్వహించబడవు.
  • సాధన సంగమాలు (ఏప్రిల్), సన్యాసుల పర్యటనలు మరియు తిరోగమనాలతో సహా అన్ని ఈవెంట్‌లు రద్దు చేయబడ్డాయి.
  • వై.ఎస్.ఎస్. ఆశ్రమాలు గాని, రిట్రీట్ సెంటర్లను గాని సందర్శించడానికి మరియు బస చేయడానికి, భక్తులు ఏవైనా ప్రయాణ ప్రణాళికలు చేసి ఉంటే వాటిని రద్దు చేసుకోవాలని అభ్యర్థిస్తున్నాము.

srfonlinemeditation.org లో భక్తులు ఆన్‌లైన్ సమూహ ధ్యానాలలో పాల్గొనడం కొనసాగించవచ్చు, ఇక్కడ సోమ, గురువారాల్లో (IST సాయంత్రం 5:10 నుండి 6:30 వరకు) సాయంత్రం కార్యక్రమాలకు వై.ఎస్.ఎస్. సన్యాసులు నాయకత్వం వహిస్తారు. మరింత తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

para-ornament

సవరణ: మార్చి 5, 2020

భారతదేశంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందడం ప్రారంభించిందన్న విషయం అందరికి తెలిసిందే. మేము ఈ ప్రాంతంలోని ప్రజారోగ్య నిపుణులను సంప్రదించగా వారు అన్ని అనవసరమైన సమావేశాలను సస్పెండ్ చేయమని గట్టిగా సలహా ఇచ్చారు. వారి సలహాలను దృష్టిలో ఉంచుకుని, మరియు చాలా జాగ్రత్తలతో, శ్రద్ధతో, ఈ క్రింది నిర్ణయాల గురించి మీకు తెలియజేయడానికి మేము చింతిస్తున్నాము, ఇది తక్షణమే అమలులోకి వస్తుంది మరియు తదుపరి నోటీసు వచ్చే వరకు పని చేస్తుంది:

దయచేసి ఈ ముఖ్యమైన అప్‌డేట్‌ను భక్తులందరికీ నోటీసు బోర్డులు, ఇమెయిల్, SMS మరియు వాట్సాప్ ద్వారా వీలైనంత త్వరగా షేర్ చేయండి, ఈ క్లిష్ట సమయంలో మానవాళి అందరి కోసం ప్రార్థనలో పాల్గొనమని వారిని అభ్యర్థించండి. భక్తులకు ఏవైనా సందేహాలు ఉంటే, వారు వై.ఎస్.ఎస్. రాంచీ హెల్ప్ డెస్క్‌ని ఇమెయిల్ [email protected] ద్వారా లేదా ఫోన్ ద్వారా సంప్రదించవచ్చు: +91 (651) 6655 555 (సోమ-శని: ఉదయం 9 నుండి సాయంత్రం 4.30 వరకు) మన గురుదేవుల ఈ మాటలను గుర్తుంచుకుందాం: “ఏ విషయం గురుంచి అయితే మీరు భయపడుతున్నారో, దాని మీద నుండి మీ మనస్సును తీసివేయండి, దానిని భగవంతునికి వదిలివేయండి. ఆయనపై విశ్వాసం ఉంచుకోండి…ప్రతి రాత్రి, మీరు నిద్రపోయే ముందు, ఇలా పునరావృతం చేసుకుంటూ ఉండండి: ‘పరలోకపు తండ్రి నాతో ఉన్నాడు; నేను రక్షించబడ్డాను.’ మానసికంగా, ఆయన యొక్క ఆత్మ మరియు విశ్వశక్తిని మీ చుట్టూ చుట్టేసుకోండి.” అనారోగ్యాన్ని నివారించడానికి మనం ఆచరణాత్మకమైన బాహ్య మార్గాలను మరియు సాధారణ పద్ధతులను ఉపయోగించాలని గురుదేవ ఆశించారు, అయితే దేవుని ప్రేమ మరియు రక్షణపై సానుకూల దృక్పథం మరియు విశ్వాసం కలిగి ఉండాలని కూడా ఆయన కోరారు. ధ్యానం మరియు ప్రార్థనలో అనుభూతి చెందే ఆ అంతర్గత సామరస్యం మనకు మరియు అవసరమైన వారందరికీ సహాయం చేయడానికి, దేవుని స్వస్థపరిచే శక్తి యొక్క అనంతమైన రిజర్వాయర్‌లోకి చేరుకోవడానికి అనుమతిస్తుంది.

ఇతరులతో పంచుకోండి