యోగదా సత్సంగ శాఖా ఆశ్రమం — ద్వారహాట్

ఉత్తరాఖండ్

ఉత్తరాఖండ్‌ లోని రమణీయమైన హిమాలయ పర్వత పాదాల నడుమ నెలకొని ఉన్న ద్వారాహాట్, యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా/సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ (వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్.) భక్తులకు ప్రగాఢమైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగిన ప్రదేశం. మహావతార్ బాబాజీ యొక్క దివ్యసాన్నిధ్యంతో పావనమై, వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్ మహాగురువుల వారసత్వంతో ముడిపడియున్న ఈ కొండలు శాంతి, ఆంతరంగిక సంయోగం మరియు క్రియాయోగం యొక్క శాశ్వత సత్యాల సాక్షాత్కారం కోసం తపించే చిత్తశుద్ధి గల సాధకులను చాలా కాలంగా ఆకర్షిస్తున్నాయి.

ఈ సహజసిద్ధంగా ఉత్తేజకరమైన వాతావరణంలో, ద్వారాహాట్‌ లోని యోగదా సత్సంగ శాఖా ఆశ్రమం భక్తులకు వారి ఆధ్యాత్మిక జీవితాన్ని గాఢతరం చేసుకోవడానికి ఒక ఆహ్లాదకరమైన ఆశ్రయాన్ని అందిస్తుంది. ధ్యాన శిబిరం కోసం గాని, ఒక ప్రత్యేక కార్యక్రమం కోసం గాని, లేదా వ్యక్తిగత సాధన కోసం గాని వచ్చిన భక్తులు ధ్యానం, ఆత్మపరిశీలన మరియు పరమహంస యోగానంద గారి బోధనలతో అనుసంధానం కోసం ఈ ఆశ్రమంలోని ప్రశాంత వాతావరణాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.

హిమాలయాల్లో ఒక ఆధ్యాత్మిక స్వర్గధామం

1983లో నిర్మించి, ప్రారంభించిన ఈ ఆశ్రమ ప్రాంగణంలో ఒక ధ్యాన మందిరం ఉంది. ఇక్కడ భక్తులు ప్రతిరోజూ వై.ఎస్.ఎస్. సన్యాసులచే నిర్వహించబడే సామూహిక ధ్యానాలు మరియు సత్సంగాల కోసం సమావేశమవుతారు.

ఇక్కడి నివాససముదాయాలు కార్యక్రమాలకు లేదా వ్యక్తిగత ధ్యాన శిబిరాలకు హాజరయ్యే భక్తుల కోసం పరిశుభ్రమైన, సౌకర్యవంతమైన గదులు, భోజన సదుపాయాలు మరియు ఇతర అవసరమైన సౌకర్యాలను అందిస్తాయి. వివిధ భవనాలను కలిపే మార్గాలకు ఇరు వైపులా చక్కగా నిర్వహించబడిన తోటలు, విశాలమైన ప్రాంగణాలు మరియు నీడ గల కూర్చొనే ప్రదేశాలు ఉన్నాయి. ప్రశాంతమైన హిమాలయ పరిసరాలతో పాటు, ఈ నిశ్శబ్ద ప్రదేశాలు భక్తులకు ధ్యానం, ఆత్మపరిశీలన మరియు దైవంతో నిశ్శబ్ద సాన్నిహిత్యం కోసం పుష్కలమైన అవకాశాన్ని కల్పిస్తాయి.

మహావతార్ బాబాజీ గుహ మరియు స్మృతి భవనం

ద్వారాహాట్ నుండి సుమారు 25 కిలోమీటర్ల దూరంలో, దునగిరి పర్వతాల ఒడిలో ఒదిగి ఉన్నది మహావతార్ బాబాజీ గుహ — మహావతార్ బాబాజీ, లాహిరి మహాశయులకు 1861లో ప్రాచీన శాస్త్రమైన క్రియాయోగ దీక్షనిచ్చిన పవిత్ర స్థలం. ఆధునిక కాలంలోని క్రియాబాన్‌లందరూ తమ పరంపర యొక్క మూలాలను ఈ సంఘటనకే — ఆధునిక ప్రపంచానికి క్రియాయోగాన్ని తిరిగి పరిచయం చేసిన ఈ దివ్య సమావేశానికి – ఆపాదిస్తారు.

గుహ సమీపంలో, వై.ఎస్.ఎస్. వారు మహావతార్ బాబాజీ గౌరవార్థం స్మృతి భవనం అనే ఒక చిన్న మందిరాన్ని కూడా స్థాపించారు. ఈ పవిత్ర పుణ్యక్షేత్రాన్ని సందర్శించే భక్తులకు ఇది ఒక జ్ఞాపకంగా, ధ్యాన ప్రదేశంగా ఉపయోగపడుతుంది.

ఈ పవిత్ర స్థలాలను సందర్శించాలని ఆలోచన చేస్తున్న వారు మరింత సమాచారాన్ని మరియు సహాయకరమైన మార్గదర్శకాలను ఇక్కడ పొందవచ్చు.

ప్రముఖులు మరియు ఉన్నతాధికారుల సందర్శనలు

మన ప్రియమైన గురుదేవుల ఒక యోగి ఆత్మకథ ద్వారా, అలాగే ఇంటర్నెట్ మరియు ఆన్‌లైన్ మాధ్యమాల ద్వారా మహావతార్ బాబాజీ గురించి మరింత ఎక్కువ మందికి తెలుస్తున్నందున, ఇక్కడికి ప్రతిరోజూ వచ్చే సందర్శకుల సంఖ్య పెరుగుతోంది (వీరు కొన్నిసార్లు బస్సుల నిండా కూడా వస్తూ ఉంటారు). ఈ గొప్ప అమర గురువు ఆశీర్వాదాలను పొందడానికి ఈ పవిత్ర స్థలానికి తీర్థయాత్రగా వచ్చే వారిలో ప్రముఖులు, ఉన్నతాధికారులు కూడా ఉంటారు.

చాలా మంది యాత్రికులకు, ఈ తీర్థ యాత్రలు మహావతార్ బాబాజీ గురించి మరియు ప్రాచీన క్రియాయోగ శాస్త్రం గురించి మరింత తెలుసుకోవడానికి అవకాశాన్నిస్తాయి. ఈ క్రియాయోగ శాస్త్రం యొక్క ఆధునిక పునరుజ్జీవనం మరియు ప్రపంచవ్యాప్త వ్యాప్తికి, ఈ మహాగురువులే, పరమహంస యోగానంద మరియు వై.ఎస్.ఎస్./ ఎస్.ఆర్.ఎఫ్. గురుపరంపర ద్వారా మార్గదర్శకత్వం వహించారు.

ధార్మిక మరియు మానవతావాద కార్యక్రమాలు

ఒక వ్యక్తి మానవాళికి, వారిని తమ ఉన్నతమైన ఆత్మస్వరూపంగా భావించి సేవ చేయాలన్న పరమహంస యోగానంద గారి ఆదర్శానికి అనుగుణంగా…. వై.ఎస్.ఎస్. ద్వారాహాట్ ఆశ్రమం, ద్వారాహాట్ మరియు చుట్టుపక్కల హిమాలయ గ్రామ నివాసుల కోసం క్రమం తప్పకుండా వివిధ సేవా కార్యక్రమాలను మరియు సహాయక చర్యలను చేపడుతుంది. ఆరోగ్య సంరక్షణకు పరిమిత ప్రాప్యత ఉన్నవారి కోసం ఈ ఆశ్రమం సంవత్సరానికి రెండుసార్లు ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తుంది, ఇందులో ఉచిత మందులు, రోగ నిర్ధారణ సహాయం మరియు పలు ప్రత్యేక విభాగాలలో సంప్రదింపులు అందిస్తుంది.

అంతేకాకుండా, బాల కృష్ణాలయ అనే నిరుపేద బాలల కోసం తాము నడిపే స్వచ్ఛంద ప్రాథమిక పాఠశాల ద్వారా మరియు ధ్యానం, యోగా, కళలు, విలువలతో కూడిన విద్య, మరియు జీవన-నైపుణ్యాల శిక్షణలను మేళవించే వార్షిక బాలల వేసవి శిబిరం ద్వారా ఈ ఆశ్రమం విద్య మరియు యువత అభివృద్ధి రంగాలలో పని చేస్తుంది. అలాగే, వివిధ స్కాలర్‌షిప్‌లు మరియు ఇతర సహాయాలను అందించడం ద్వారా, అసాధారణ ప్రతిభ మరియు ప్రజ్ఞ కలిగిన స్థానిక విద్యార్థులకు ఆశ్రమం మద్దతునిస్తుంది.

వై.ఎస్.ఎస్. కు కొత్తవారా?

గృహ-అధ్యయన పాఠ్యక్రమం అయిన వై.ఎస్.ఎస్. పాఠాలు, మీరు ఊహించని విధంగా మీ జీవితంలో పరివర్తన చేకూర్చి, సమతుల్యము మరియు విజయవంతమైన జీవితాన్ని గడపడానికి ఎలా సహాయపడతాయో మరింతగా తెలుసుకోండి.

para-ornament

ప్రతి వారం కార్యక్రమాలు

సామూహిక ధ్యానం

అందరూ పాల్గొనేలా ధ్యానం మరియు సత్సంగాలను ప్రతిదినం మేము అందిస్తున్నాం. ఈ సమావేశాలు నియమిత సమయంపాటు నిశ్శబ్ద ధ్యానం, భక్తి గీతాలాపన మరియు స్ఫూర్తిదాయక పఠనంతో కూడి ఉంటాయి.

ఆదివారం
ఉదయం 10:30 – మధ్యాహ్నం 12:00
ఆదివారం సత్సంగం (ఒక సంక్షిప్త ధ్యానంతో కూడి ఉంటుంది)
సాయంత్రం 4:00 – రాత్రి 7:00
సాయంత్రపు ధ్యానం (నవంబర్ – ఫిబ్రవరి)
సాయంత్రం 5:00 – రాత్రి 8:00
సాయంత్రపు ధ్యానం (మార్చి – అక్టోబర్)
గురువారం
ఉదయం 7:00 – ఉదయం 8:00
ఉదయపు ధ్యానం
సాయంత్రం 4:00 – రాత్రి 7:00
సాయంత్రపు ధ్యానం (నవంబర్ – ఫిబ్రవరి)
సాయంత్రం 5:00 – రాత్రి 8:00
సాయంత్రపు ధ్యానం (మార్చి – అక్టోబర్)
ఇతర రోజులు
ఉదయం 7:00 – ఉదయం 8:00
ఉదయపు ధ్యానం
సాయంత్రం 5:30 – రాత్రి 7:00
సాయంత్రపు ధ్యానం

తాజా సమాచారం మరియు కార్యక్రమాల ప్రకటనలను పొందడానికి వై.ఎస్.ఎస్. e-వార్తల కోసం సైన్ అప్ చేయండి

రాబోయే ప్రత్యేక కార్యక్రమాలు మరియు దీర్ఘ ధ్యానాలు

నెలవారీ దీర్ఘ ధ్యానం
నవంబర్ 15, 2026, ఆదివారం
ఉదయం 10:00 – సాయంత్రం 4:00
సామూహిక ధ్యానం
ఏకాంత ధ్యాన వాసం (హిందీ/ఇంగ్లీష్)

(వై.ఎస్.ఎస్. సన్యాసులచే విర్వహణ)

డిసెంబర్ 4, 2026, శుక్రవారం – డిసెంబర్ 6, 2026, ఆదివారం
క్రిస్మస్ దీర్ఘ ధ్యానం
డిసెంబర్ 20, 2026, ఆదివారం
ఉదయం 9:00 – సాయంత్రం 5:00
సామూహిక ధ్యానం
క్రిస్మస్
డిసెంబర్ 25, 2026, శుక్రవారం
ఉదయం 6:30 – ఉదయం 8:00
ఉదయపు ధ్యానం
సాయంత్రం 4:30 – సాయంత్రం 6:30
సాయంత్రపు ధ్యానం

వార్తలు & ఫోటో గ్యాలరీ

మీ సందర్శనను ప్లాన్ చేసుకోండి

YSS Dwarahat Ashram – Plan Your Visitమీరు పగటిపూట ఆశ్రమాన్ని సందర్శించాలనుకుంటున్నారా?

సామూహిక ధ్యానాలలో పాల్గొని, ఆశ్రమంలోని ప్రశాంతతను ఆస్వాదించవలసిందిగా మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. ద్వారాహాట్ సమీపంలో మహావతార్ బాబాజీకి సంబంధించిన పవిత్ర స్థలాలకు తీర్థ యాత్ర చేయడానికి కూడా మీకు స్వాగతం. మీకు ఆశ్రమంలో నిర్దేశిత యాత్రలో పాల్గొనడానికి లేదా మహావతార్ బాబాజీ గుహ లేదా స్మృతి భవనం వంటి ప్రదేశాలను సందర్శించడానికి ఆసక్తి ఉంటే, దయచేసి అపాయింట్మెంట్ కోసం మా రిసెప్షన్ డెస్క్‌ను సంప్రదించండి.

దయచేసి గమనించండి: ఆశ్రమం ప్రాంగణం ప్రతిరోజూ ఉదయం 9:00 గంటల నుండి సాయంత్రం 5:00 గంటల వరకు సందర్శకులందరికీ తెరిచి ఉంటుంది.

వ్యక్తిగత ఏకాంత ధ్యానవాసాన్ని ప్లాన్ చేసుకోండి లేదా ఆశ్రమంలో నిర్వహించబడే ఏకాంత ధ్యానవాసంలో పాల్గొనండి.

వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. పాఠాల విద్యార్థులు గరిష్టంగా ఐదు రోజుల వరకు ఆశ్రమంలో బస చేయవచ్చు. భక్తులు పునరుత్తేజం మరియు పునరుజ్జీవనం పొందడానికి వ్యక్తిగత ఏకాంత ధ్యానవాసం చేపట్టాలని లేదా మేము నిర్వహించే ఏకాంత ధ్యానవాసాలలు ఒకదానిలో చేరాలని మేము ప్రోత్సహిస్తాము. ఈ ఏకాంత ధ్యానవాస సమయంలో, మీరు రోజుకు రెండుసార్లు వై.ఎస్.ఎస్. సన్యాసులు నిర్వహించే సామూహిక ధ్యానాలలో పాల్గొనవచ్చు మరియు యోగదా సత్సంగ బోధనల అధ్యయనం మరియు అభ్యాసంలో ఆధ్యాత్మిక సలహా మరియు మార్గదర్శకత్వం పొందవచ్చు.

ఆశ్రమంలో వసతిని అభ్యర్థించడానికి దయచేసి క్రింద బటన్‌ను క్లిక్ చేయండి.

మమ్మల్ని సంప్రదించండి

యోగదా సత్సంగ శాఖా ఆశ్రమం – ద్వారహాట్
Tahsil Road
Dwarahat - 263653
Almora
Uttarakhand

ఎలా చేరుకోవాలి

ఉత్తరాఖండ్‌ లోని అల్మోరా జిల్లాలో ఉన్న ద్వారాహాట్ ను విమాన, రైలు మరియు రోడ్డు మార్గాల ద్వారా సులభంగా చేసుకోవచ్చు. చాలా మంది సందర్శకులు కుమావోన్ ప్రాంతానికి ప్రధాన ప్రవేశ ద్వారాలుగా పనిచేసే కాఠ్‌గోదాం లేదా హల్ద్వానీ మీదుగా ద్వారాహాట్ చేరుకుంటారు.

విమాన మార్గం ద్వారా

ద్వారాహాట్ కు అత్యంత సమీప విమానాశ్రయం పంత్‌నగర్ విమానాశ్రయం (PGH), ఇది సుమారు 149 కిలోమీటర్ల దూరంలో ఉంది. పంత్‌నగర్ విమానాశ్రయం నుండి ఢిల్లీ మరియు నోయిడాలకు పరిమితమైనప్పటికీ క్రమమైన విమాన సర్వీసులు ఉన్నాయి. విమానాశ్రయం నుండి ద్వారాహాట్ కు టాక్సీలు సులభంగా అందుబాటులో ఉంటాయి; రోడ్డు మార్గంలో ప్రయాణ సమయం సుమారు 6 గంటలు.

రైలు ద్వారా

వై.ఎస్.ఎస్. ద్వారాహాట్ ఆశ్రమం నుండి సమీప రైల్వే స్టేషన్లు కాఠ్‌గోడం (ఆశ్రమం నుంచి 116 కి.మీ. దూరం) మరియు హల్ద్వానీ (ఆశ్రమం నుంచి 122 కి.మీ. దూరం). రైల్వే స్టేషన్ల నుండి ద్వారాహాట్ కు టాక్సీలు మరియు బస్సులు సులభంగా దొరుకుతాయి. రైల్వే స్టేషన్ల నుండి ఆశ్రమానికి టాక్సీలో ప్రయాణ సమయం సుమారు 5 గంటలు.

ఢిల్లీ నుండి కాఠ్‌గోదాంకు అందుబాటులో ఉన్న కొన్ని రైళ్ల వివరాలు కింద ఇవ్వబడ్డాయి:

  • కాఠ్‌గోదాం శతాబ్ది ఎక్స్‌ప్రెస్ (12040) – న్యూఢిల్లీ స్టేషన్ నుండి తెల్లవారుజామున బయలుదేరి మధ్యాహ్నం కాఠ్‌గోదాంకు చేరుకుంటుంది.
  • రాణీఖేత్ ఎక్స్‌ప్రెస్ (15013) – ఇది జైసల్మేర్ నుండి జైపూర్ మరియు ఢిల్లీ మీదుగా కాఠ్‌గోదాం వరకు నడుస్తుంది. ఇది రాత్రి ఢిల్లీ నుండి బయలుదేరి తెల్లవారుజామున కాఠ్‌గోదాం చేరుకుంటుంది.
రోడ్డు మార్గం ద్వారా

ద్వారాహాట్, ఉత్తరాఖండ్ మరియు ఉత్తర భారతదేశంలోని ప్రధాన పట్టణాలు మరియు నగరాలకు మోటారు వాహనాలు వెళ్ళే రహదారుల ద్వారా చక్కగా కలపబడి ఉంది.

ఉత్తరాఖండ్‌ లోని సమీప నగరాలైన కాఠ్‌గోదాం (ఆశ్రమం నుంచి 116 కి.మీ. దూరం), హల్ద్వానీ (122 కి.మీ.), అల్మోరా (70 కి.మీ.), నైనిటాల్ (93 కి.మీ.), రాణీఖేత్ (35 కి.మీ.), మరియు కౌసాని (50 కి.మీ.) నుండి బస్సు మరియు టాక్సీ సేవలు అందుబాటులో ఉన్నాయి.

ప్రత్యామ్నాయంగా మీరు ఢిల్లీ నుండి కారులో ప్రయాణించవచ్చు (420 కి.మీ. దూరం), దీనికి సుమారు 10 గంటల సమయం పడుతుంది. ఢిల్లీలోని ISBT ఆనంద్ విహార్ నుండి కాఠ్‌గోదాం, అల్మోరా లేదా నైనిటాల్‌కు బస్సులు ఎక్కి, ఆ తర్వాత ద్వారాహాట్‌కు కనెక్టింగ్ బస్సు లేదా టాక్సీలో వెళ్లవచ్చు.

దయచేసి గమనించండి: సగటున 1,500 మీటర్ల (5,000 అడుగుల) ఎత్తులో, దట్టమైన దేవదారు వనాలతో కప్పబడి ఉండటం వల్ల, ద్వారాహాట్ ఏడాది పొడవునా చల్లగా ఉంటుంది; అలాగే నవంబర్ నుండి ఫిబ్రవరి వరకు ఉండే శీతాకాల నెలల్లో చాలా చల్లగా ఉంటుంది. సాయంత్రం 7:00 గంటలకల్లా పట్టణం నిశ్శబ్దంగా మారిపోతుంది కాబట్టి, మీరు సాయంత్రం కంటే ముందే ఆశ్రమానికి చేరుకోవాలని మేము సిఫార్సు చేస్తున్నాము.

ఇతరులతో పంచుకోండి