యోగదా సత్సంగ శాఖా మఠం, రాంచీ

రాంచీ ఆశ్రమం ప్రధాన భవనం

యోగదా సత్సంగ శాఖా మఠం, పరమహంస యోగానంద మార్గం
రాంచీ 834 001
ఫోన్: +91 (651) 6655 555

వెబ్‌సైట్ లింక్: https://ranchi.yssashram.org/

గత వంద సంవత్సరాలుగా, యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా (వై.ఎస్.ఎస్.) పశ్చిమంలో యోగ పితామహులుగా విస్తృతంగా గౌరవించబడే దాని వ్యవస్థాపకులు పరమహంస యోగానందగారి ఆధ్యాత్మిక మరియు మానవతా సేవలను కొనసాగించడానికి అంకితం చేయబడింది.

1917లో, రాంచీలో, పరమహంస యోగానందగారు ఒక ఆశ్రమాన్ని మరియు బాలుర కోసం “ఎలా జీవించాలి” అనే పాఠశాలను మరియు క్రియాయోగం యొక్క సార్వత్రిక బోధనలను అందుబాటులోకి తీసుకురావడం అనే కార్యాలతో తమ జీవితాన్ని ప్రారంభించారు.
మా ఆశ్రమ కేంద్రాలు మరియు రిట్రీట్స్ సందర్శించడానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము, ప్రకృతి అందాలతో మరియు ప్రశాంతమైన వాతావరణంతో మనస్సుకు మరియు ఆత్మకు ఆహ్లాదాన్ని కలిగించే మా ఆశ్రమ కేంద్రాలలో జరిగే ఉపన్యాస సేవలు మరియు ధ్యాన కార్యక్రమాలకు కూడా మీకు స్వాగతం. యోగదా సత్సంగ బోధనలను అధ్యయనం మరియు అభ్యాసం చేయడంలో మార్గదర్శకత్వం వహించడానికి మరియు ఆధ్యాత్మికంగా సూచనలు మరియు సలహాలు అందించడానికి సంస్థ యొక్క సన్న్యాసులు అందుబాటులో ఉంటారు.

పరమహంస యోగానందుల గది

మహాగురువుల ప్రారంభ సంవత్సరాలలోని యొక్క నివాస గృహాలు ఒక పుణ్యక్షేత్రంగా భద్రపరచబడ్డాయి. వ్యక్తిగత ధ్యానం కోసం ఆ గది రోజంతా అందరికీ తెరిచి ఉంటుంది. గది లోపల కాలిఫోర్నియాలోని లాస్ ఏంజిలిస్ లోని ఎస్.ఆర్.ఎఫ్. అంతర్జాతీయ ప్రధాన కార్యాలయం నుండి తెచ్చిన గురుదేవుల చేతి ముద్రలు మరియు పాద ముద్రలు ఉన్నాయి. గురుదేవుల మహాసమాధి వద్ద ఉంచబడిన గులాబీ పువ్వుతో సహా వారి వ్యక్తిగత వస్తువులలో కొన్నిటిని గురుదేవుల గది బయట భక్తుల సందర్శనార్ధం ఉంచడం జరిగింది.

రాజర్షి జనకానందకు వ్రాసిన లేఖలో, గురుదేవులు ఇలా వ్రాశారు, “నేను నా ఆధ్యాత్మిక సాధన యొక్క గుప్త అమృతాన్ని మౌంట్ వాషింగ్టన్ [లాస్ ఏంజిలిస్, కాలిఫోర్నియాలోని సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ అంతర్జాతీయ ప్రధాన కార్యాలయం] మరియు రాంచీలో వెదజల్లాను….”

పరమహంస యోగానంద

లిచీ వేది

రాంచీ ఆశ్రమంలో మన దివ్యమైన గురుదేవులతో సంబంధం ఉన్న పవిత్ర ప్రదేశాలలో లిచీ వేది ఒకటి. ఈ పెద్ద లిచీ చెట్టు యొక్క నీడ పందిరి కింద, ఆయన స్థాపించిన పాఠశాలలో చదివే బాలుర కోసం మహాగురువులు తరచుగా బహిరంగ తరగతులు మరియు సత్సంగాలు నిర్వహించేవారు. ఈ ప్రదేశం పరమహంస యోగానందగారితో చాలా దగ్గరి సంబంధం కలిగి ఉన్నందున, అనేక దశాబ్దాలుగా దాని కొమ్మల క్రింద ప్రతిష్టించబడిన పరమహంసగారి పెద్ద చిత్రం ఉన్న ఈ చెట్టు వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. సభ్యులకు తీర్థయాత్ర మరియు ధ్యానానికి ఇష్టమైన ప్రదేశంగా ఉన్నది.

ఇటీవల, శాస్త్రవేత్తలు ఈ ఆధ్యాత్మికంగా ప్రియమైన చెట్టు గురించి విశేషమైన భౌతిక వాస్తవాన్ని కనుగొన్నారు: ఇది శాస్త్రీయంగా ఒక ప్రత్యేకమైన రకంగా గుర్తించబడింది, ఇది ఉద్యానవన శాస్త్రవేత్తలచే గతంలో ఎన్నడూ నమోదు చేయబడలేదు మరియు అధికారికంగా పరమహంస యోగానందుల పేరు పెట్టబడింది. ఇప్పుడు ఈ చెట్టు “పరమహంస యోగానంద లిచీ కల్టివర్ ఎంపిక”గా నమోదు చేయబడింది.

యోగాదా, రాంచీలో, లిచీ వేది క్రింద ధ్యానం
రాంచీ స్మృతి మందిరం

స్మృతి మందిరం

ఆయన ఆత్మకథలో పరమహంసగారు ఇలా వ్రాశారు: “అమెరికా! ఖచ్చితంగా ఈ వ్యక్తులు అమెరికన్లు!” పాశ్చాత్య ముఖాల విశాల దృశ్యం నా అంతర్ దృష్టికి ముందు వచ్చినప్పుడు ఇది నా ఆలోచన. ధ్యానంలో మునిగిపోయి, నేను రాంచీ స్కూలు స్టోర్‌ రూమ్‌లో కొన్ని డస్ట్ బాక్సుల వెనుక కూర్చొన్నాను….దృశ్యం కొనసాగింది; అపారమైన జన సమూహం, నన్ను ఆసక్తిగా చూస్తూ, చైతన్య దశ అంతటా నటుడిలా కదిలింది.

ఈ పవిత్రమైన ప్రదేశంలో స్మృతి మందిరం ఉంది, అన్ని వైపులా అలంకార అల్లికలతో గోడ మరియు ఒక పెద్ద పద్మాకార కలశముతో ఒక ఎత్తైన అష్టభుజి పాలరాతి ఆలయం ఉంది. ప్రపంచవ్యాప్త కార్యానికి తన మొదటి అడుగుకు ఇది స్మారక చిహ్నం.

రిట్రీట్స్

ఆధ్యాత్మిక పునరుద్ధరణకు కొంత కాలం రావాలనుకునే వై.ఎస్.ఎస్. సభ్యులు మరియు స్నేహితుల కోసం ఈ రిట్రీట్ ఏడాది పొడవునా (శరద్ సంగం సమయంలో మినహా) తెరిచి ఉంటుంది. పరమహంస యోగానందగారి బోధనలపై ఏడాది పొడవునా సన్యాసుల చేత ప్రత్యేక రిట్రీట్స్ నిర్వహించబడతాయి. బోధనలు తెలిసిన వారి కోసం ఈ రిట్రీట్స్ నిర్మాణాత్మకంగా ఉన్నప్పటికీ, ఆసక్తి ఉన్న ఎవరైనా రిసెప్షన్‌లో విచారించడానికి స్వాగతం.

రాంచీ ఆశ్రమ ధ్యాన ఉద్యానవనం

ధ్యాన తోటలు

ఆశ్రమ ప్రాంగణం అనేక రకాల మొక్కలు మరియు చెట్లతో అనేక అందమైన ప్రకృతి దృశ్యాలతో శోభిస్తుంటుంది. ఈ ఉద్యానవనాలు శరీరం, మనస్సు మరియు ఆత్మలో విశ్రాంతి తీసుకోవడానికి ఒక అవకాశాన్ని అందిస్తాయి. ధ్యానం చేయాలనుకునేవారికి లేదా ఈ ఆధ్యాత్మిక ప్రదేశం యొక్క శాంతి మరియు ప్రశాంతతను గ్రహించాలనేవారికి అనేక ధ్యాన బల్లలు అందించబడ్డాయి.

Share this on

Share on facebook
Share on twitter
Share on whatsapp