ఎస్.ఆర్.ఎఫ్. మదర్ సెంటర్ భవిష్యత్తు యొక్క రూపకల్పన

(స్వామి చిదానంద గిరి గారితో ప్రత్యేక ప్రత్యక్ష-ప్రసారం)

శనివారం, సెప్టెంబర్ 12, 2026

రాత్రి 10:30 నుండి

(భారతీయ కాలమానం ప్రకారం)

స్వామి చిదానంద గిరి గారితో ప్రత్యేక ప్రత్యక్ష-ప్రసారం — సెప్టెంబర్ 12, 2026

ఈ కార్యక్రమం గురించి

ఎస్.ఆర్.ఎఫ్. అంతర్జాతీయ ప్రధాన కార్యాలయం ఆధునీకరణ మరియు పునరుద్ధరణ ప్రాజెక్ట్ ప్రణాళికల వెనుక ఉన్న దార్శనికతను, ప్రేరణను వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. అధ్యక్షులు మరియు ఆధ్యాత్మిక అధిపతి స్వామి చిదానంద గిరి గారు, మరియు ఎస్.ఆర్.ఎఫ్. ఉపాధ్యక్షులు స్వామి విశ్వానంద గిరి గారు ఆవిష్కరించే ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. ఈ కార్యక్రమంలో, ఈ ప్రాజెక్ట్ పూర్తయిన తరువాత ఎలా ఉంటుందో, ఆ “ముందస్తు ప్రదర్శన”ను కూడా వారు పంచుకుంటారు.

ఎస్.ఆర్.ఎఫ్. అంతర్జాతీయ ప్రధాన కార్యాలయం (ఎస్.ఆర్.ఎఫ్. మదర్ సెంటర్) 1925లో లాస్ ఏంజిలిస్ లో పరమహంస యోగానందగారిచే స్థాపించబడింది. ప్రపంచ మానవాళి అందరికీ క్రియాయోగం యొక్క ప్రాచీన విజ్ఞానాన్ని అందించే ఆయన ప్రపంచ లక్ష్యానికి ఇది ఒక ఆధ్యాత్మిక, పరిపాలనా కేంద్రంగా ఉంది.

ఈ కార్యక్రమం లాస్ ఏంజిలిస్ లోని ఎస్.ఆర్.ఎఫ్. అంతర్జాతీయ ప్రధాన కార్యాలయం నుండి సెప్టెంబర్ 12 రాత్రి 10:30 (భారతీయ కాలమానం ప్రకారం) నుండి ప్రత్యక్ష-ప్రసారమవుతుంది, మరియు ఆ తరువాత కూడా వీక్షించడానికి ఇది అందుబాటులో ఉంటుంది.

ఈ కార్యక్రమం ఇంగ్లీషులో నిర్వహించబడుతుంది. అదే సమయంలో హిందీలో వివరణ (జూమ్ ద్వారా ప్రత్యక్ష ప్రసార సమయంలో మాత్రమే) అందుబాటులో ఉంటుంది.

అదే సమయంలో హిందీలో వివరణను పొందడానికి:

  • జూమ్ ద్వారా పాల్గొనండి (కార్యక్రమం ప్రత్యక్షప్రసారం సందర్భంలో). కార్యక్రమానికి కొద్ది నిమిషాల ముందు దీనిలో చేరమని సూచిస్తున్నాము.
  • మీ జూమ్ విండో దిగువన ఉన్న టూల్ బార్ లో “Interpretation” బటన్ మీద క్లిక్ చేయండి. (మీకు ఆ బటన్ కనిపించకపోతే, “More” బటన్ మీద క్లిక్ చేసి Menu నుండి “Interpretation” ఎంపిక చేసుకోండి.)
  • జాబితాలో “Hindi” ఎంచుకోండి.
  • ఒకసారి కార్యక్రమం ప్రారంభమయ్యాక, మీరు హిందీలో ఏకకాల వివరణను వింటారు.

దయచేసి గమనించండి:

  • మీకు సాంకేతిక సహాయం అవసరమైతే, దయచేసి మా సహాయ కేంద్రాన్ని ఈ-మెయిల్ ద్వారా (0651) 6655 555 లేదా [email protected] కాల్ చేసి సంప్రదించండి.
  • ఈ ప్రత్యక్ష-ప్రసార కార్యక్రమంలో సాంకేతిక సహాయం కోసం వై.ఎస్.ఎస్. సహాయ కేంద్రం రాత్రి 10 (భారతీయ కాలమానం ప్రకారం) నుండి అందుబాటులో ఉంటుంది.

నూతన సందర్శకులు

వై.ఎస్.ఎస్. కు మరియు పరమహంస యోగానందగారి బోధనలకు కొత్తవారైతే, క్రింద ఉన్న లింక్ లను అన్వేషించడానికి ఇష్టపడవచ్చు:

ఒక యోగి ఆత్మకథ

ఒక అత్యుత్తమ ఆధ్యాత్మిక రచనగా ప్రపంచవ్యాప్తంగా ప్రశంసించబడుతున్న తమ పుస్తకం గురించి పరమహంసగారు తరచుగా, “నేను లేనప్పుడు ఈ పుస్తకం నా దూత అవుతుంది,” అనే వారు.

వై.ఎస్.ఎస్. పాఠాలు

మీరు ఊహించని విధంగా మీ జీవితాన్ని మార్చడానికి, సమతుల్యతను సాధించటానికి మరియు విజయవంతమైన జీవితాన్ని గడపడానికి మీకు సహాయపడే గృహ-అధ్యయన పాఠ్యక్రమం.

ఇతరులతో పంచుకోండి