1950లో పరమహంస యోగానందగారు కాలిఫోర్నియాలోని పెసిఫిక్ పాలిసేడ్స్ లో ఎస్.ఆర్.ఎఫ్. లేక్ ష్రైన్‌ను అంకితం చేసిన 75వ వార్షికోత్సవ వేడుకలను పురస్కరించుకుని, వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. అధ్యక్షులు మరియు ఆధ్యాత్మిక అధిపతి అయిన శ్రీ శ్రీ స్వామి చిదానంద గిరి గారితో కలిసి ఈ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొనడానికి మేము మిమ్మల్ని ఎంతో ఆనందంతో ఆహ్వానిస్తున్నాము.
ప్రపంచం నలుమూలల నుండి ప్రజలు ఇక్కడికి వచ్చి వారి హృదయంలో, మనస్సులో, ఆత్మలో నిజమైన శాంతిని అనుభవించేందుకు పరమహంస యోగానందగారు ఎస్.ఆర్.ఎఫ్. లేక్ ష్రైన్‌ను ఒక సార్వత్రిక ఆధ్యాత్మిక పుణ్యస్థలంగా స్థాపించారు. ఆగస్టు 20, 1950న లేక్ ష్రైన్ ప్రతిష్ఠాపన సమయంలో ఆయన ఇలా అన్నారు: “మనం నిజమైన జీవనకళను ఆచరించాలంటే ప్రపంచ సౌభ్రాతృత్వం ఉండాలి. అందరూ ఒక ఉమ్మడివిశ్వాసం యొక్క ఐక్యతాభావాన్ని అనుభూతి చెందేలా, ఈ ఆలయం అన్ని మతాల కోసం సృష్టించబడింది.”
అగ్నిప్రమాదం తరువాత, లేక్ ష్రైన్ ప్రాంగణంలో జరిగిన పునరుద్ధరణ పనుల కారణంగా ఈ కార్యక్రమాన్ని 2025లో నిర్వహించలేకపోయాము. ఈ పవిత్ర స్థలంలో వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. అధ్యక్షులతో కలిసి ఈ ముఖ్యమైన వార్షికోత్సవాన్ని ఒక ప్రత్యేక వేడుకగా జరుపుకోవడం మాకు ఎంతో సంతోషాన్ని కలుగజేస్తోంది.
ఈ కార్యక్రమం ఎస్.ఆర్.ఎఫ్. లేక్ ష్రైన్ నుండి ఆగష్టు 22 రాత్రి 10:30 (భారతీయ కాలమానం ప్రకారం) నుండి ప్రత్యక్ష-ప్రసారమవుతుంది, మరియు ఆ తరువాత కూడా వీక్షించడానికి ఇది అందుబాటులో ఉంటుంది.

















