జన్మాష్టమి

(స్మారకోత్సవ ధ్యానం మరియు ప్రసంగం)

వై.ఎస్.ఎస్. ఓ.డి.కె. జన్మాష్టమి స్మారకోత్సవ కార్యక్రమాలు — 2026

ఈ కార్యక్రమం గురించి

భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు సమతుల్యమైన, మధ్యేమార్గమైన, శ్రేష్టమైన మార్గాన్ని ఉపదేశించారు. ఇది ప్రాపంచిక వ్యవహారములలో నిమగ్నమైనవారికి మరియు పరమోన్నత ఆధ్యాత్మిక జిజ్ఞాసువులకు కూడా ఉపయుక్తమైనది.

— పరమహంస యోగానంద

శ్రీకృష్ణ భగవానుడి జన్మదినోత్సవమైన జన్మాష్టమిని యోగదా సత్సంగ సొసైటీ ప్రత్యేక స్మారకోత్సవ కార్యక్రమాలతో జరుపుకుంటుంది (ఆయన బోధనలు భగవద్గీతలో ప్రతిష్ఠితమై ఉన్నాయి). ఈ సంవత్సరం జన్మాష్టమి సెప్టెంబర్ 4వ తేదీన జరుపబడుతుంది.

ఈ పావన సందర్భంలో మనం జరుపుకుంటున్న ఈ కార్యక్రమాలలో పాల్గొనమని మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం.

వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. అధ్యక్షులు స్వామి చిదానంద గిరి గారితో
జన్మాష్టమి స్మారకోత్సవ ధ్యానం
(హిందీలో ప్రత్యక్ష అనువాదంతో)

శుక్రవారం, సెప్టెంబర్ 4, 2026
ఉదయం 7:00 – ఉదయం 8:00 (భారతీయ కాలమానం ప్రకారం)

ఈ ప్రత్యేక దినోత్సవం సందర్భంగా, వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. అధ్యక్షులు శ్రీ శ్రీ స్వామి చిదానంద గిరి గారు ఒక స్మారకోత్సవ ధ్యానం నిర్వహిస్తారు, లాస్ ఏంజిలిస్ లోని ఎస్.ఆర్.ఎఫ్. అంతర్జాతీయ ప్రధాన కార్యాలయం నుండి ఉదయం 7 నుండి 8 (భారతీయ కాలమానం ప్రకారం) వరకు ఇది ప్రత్యక్ష ప్రసారమవుతుంది.

అనంతరం వీక్షించడానికి కూడా ఈ వీడియో అందుబాటులో ఉంటుంది.

ఈ కార్యక్రమం ఇంగ్లీషులో నిర్వహించబడుతుంది. అదే సమయంలో హిందీలో వివరణ (జూమ్ ద్వారా ప్రత్యక్ష ప్రసార సమయంలో మాత్రమే) అందుబాటులో ఉంటుంది.

అదే సమయంలో హిందీలో వివరణను పొందడానికి:

  • జూమ్ ద్వారా పాల్గొనండి (కార్యక్రమం ప్రత్యక్షప్రసారం సందర్భంలో). కార్యక్రమానికి కొద్ది నిమిషాల ముందు దీనిలో చేరమని సూచిస్తున్నాము.
  • మీ జూమ్ విండో దిగువన ఉన్న టూల్ బార్ లో “Interpretation” బటన్ మీద క్లిక్ చేయండి. (మీకు ఆ బటన్ కనిపించకపోతే, “More” బటన్ మీద క్లిక్ చేసి Menu నుండి “Interpretation” ఎంపిక చేసుకోండి.)
  • జాబితాలో “Hindi” ఎంచుకోండి.
  • ఒకసారి కార్యక్రమం ప్రారంభమయ్యాక, మీరు హిందీలో ఏకకాల వివరణను వింటారు.

దయచేసి గమనించండి:

  • మీకు సాంకేతిక సహాయం అవసరమైతే, దయచేసి మా సహాయ కేంద్రాన్ని ఈ-మెయిల్ ద్వారా (0651) 6655 555 లేదా [email protected] కాల్ చేసి సంప్రదించండి.
  • ఈ ప్రత్యక్ష-ప్రసార కార్యక్రమంలో సాంకేతిక సహాయం కోసం వై.ఎస్.ఎస్. సహాయ కేంద్రం ఉదయం 6:30 (భారతీయ కాలమానం ప్రకారం) నుండి అందుబాటులో ఉంటుంది.
వై.ఎస్.ఎస్. సన్యాసిచే హిందీలో ప్రసంగం

भगवान कृष्ण : मानव रूप, दिव्य स्वरूप

(భగవాన్ శ్రీకృష్ణుడు: మానవరూపాన్ని ధరించిన దైవస్వరూపం)

శనివారం, ఆగష్టు 29, 2026
సాయంత్రం 6:30 – రాత్రి 7:30 (భారతీయ కాలమానం ప్రకారం)

జన్మాష్టమి పావన సందర్భంలో, యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియాకు చెందిన సన్యాసి స్వామి అచ్యుతానంద గిరి “भगवान कृष्ण : मानव रूप, दिव्य स्वरूप (భగవాన్ శ్రీకృష్ణుడు: మానవ రూపాన్ని ధరించిన దైవస్వరూపం)” అనే అంశంపై హిందీలో ప్రసంగిస్తారు.

ఈ ప్రవచనంలో శ్రీకృష్ణుని అత్యున్నత స్వభావాన్ని స్వామి అచ్యుతానంద వివరిస్తారు. ఆకర్షయతి ఇతి కృష్ణః అంటే — విడిపోయిన ఆత్మలను తిరిగి వాటి దివ్య స్వగృహానికి ఆకర్షించే అప్రతిహత వైశ్విక ఆకర్షణ శక్తి అని పూర్ణావతారమైన ఆయన పేరు సూచిస్తుంది. భగవాన్ శ్రీకృష్ణుడు భగవంతుని శాశ్వతమైన ఆనందానికి మరియు నిస్వార్థ ప్రేమకు విడదీయరాని స్వరూపమని, ఇవి సాధారణ ఇంద్రియ అనుభవాలకు మరియు మానవ బుద్ధికి అందనివని స్వామీజీ వివరిస్తారు.

శ్రీకృష్ణుని దివ్యలీల యొక్క అంతరార్థం, రాధాదేవి పరమాత్మ యందు చూపిన ఆత్మ యొక్క స్వచ్ఛమైన భక్తిని, మరియు సృష్టిని నిలబెట్టే విశ్వ సామరస్యం గురించి మరింత లోతుగా ఈ ప్రవచనంలో చర్చించబడుతుంది. భగవద్గీతపై పరమహంస యోగానందగారి వ్యాఖ్యానం God Talks With Arjuna ను ఆధారంగా చేసుకొని, క్రియాయోగ సాధన మరియు గాఢమైన అంతర్ముఖ ధ్యానం ద్వారా సాధకులు ఇంద్రియ పరిమితుల తెరను చీల్చి, పరిమితమైన మానవ బంధాలను విశ్వప్రేమగా (వసుధైవ కుటుంబం) మార్చుకొని, తమలోని సర్వజ్ఞమైన కృష్ణచైతన్యాన్ని ఎలా మేల్కొలపవచ్చో స్వామి అచ్యుతానంద వివరిస్తారు.

యోగదా సత్సంగ శాఖా మఠం, దక్షిణేశ్వర్ నుండి శనివారం, ఆగష్టు 29న ప్రత్యక్ష ప్రసారమయ్యే ప్రసంగంలో పాల్గొనేందుకు అందరికీ ఇది ఆహ్వానం.

దయచేసి గమనించండి: ఈ ప్రసంగం శుక్రవారం, సెప్టెంబర్ 4, రాత్రి 10 (భారతీయ కాలమానం ప్రకారం) వరకు వీక్షించడానికి అందుబాటులో ఉంటుంది.

వ్యక్తిగతంగా పాల్గొనే కార్యక్రమాలు

ఈ పవిత్ర సందర్భంలో, వ్యక్తిగతంగా పాల్గొనే కార్యక్రమాలను వై.ఎస్.ఎస్. ఆశ్రమాలు, కేంద్రాలు మరియు మండళ్ళు నిర్వహిస్తాయి. ఈ కార్యక్రమాల గురించి మరింతగా తెలుసుకొని పాల్గొనడానికి, దయచేసి మీకు దగ్గరలో ఉన్న ధ్యాన కేంద్రాన్ని సంప్రదించండి.

జన్మాష్టమి సందర్భంగా స్వామి చిదానంద గిరి గారి సందేశం

“ఆధ్యాత్మిక ఉన్నతిని కలిగించే భగవాన్ శ్రీకృష్ణుని జన్మదినోత్సవమైన జన్మాష్టమి సందర్భంగా మీ అందరికీ ప్రేమపూర్వక అభినందనలు. వేల సంవత్సరాల క్రితం జన్మించినప్పటికీ, దివ్యప్రేమకు ప్రతిరూపమైన ఈ ప్రియతమ మహోన్నత అవతారం, ఒకప్పుడు తమ అందమైన మానవ రూపంలో భూమిపై సంచరించినప్పుడు ఎంత వాస్తవంగా ఉన్నారో, తమ హృదయాలను ఆయనతో అనుసంధానించిన వారికి నేడు కూడా అంతే సజీవంగా ఉన్నారు — ఆత్మసాక్షాత్కార లక్ష్యం వైపు యోగ మార్గంలో నిష్ఠతో సాగే సాధకులను నడిపించడానికి మరియు వారికి ఉన్నతస్థితిని కలుగజేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు.”

విరాళం సమర్పించండి

భగవద్గీతలో శాశ్వత జ్ఞానాన్ని మనకు ప్రసాదించినందుకు భగవాన్ శ్రీకృష్ణునికి కృతజ్ఞతలు తెలిపే అవకాశాన్ని జన్మాష్టమి మనకు కలుగజేస్తుంది. ఈ సందర్భంగా మీరు ఏదైనా విరాళం సమర్పించాలనుకొంటే, దయచేసి క్రింద ఇవ్వబడిన లింక్‌ను సందర్శించండి.

నూతన సందర్శకులు

వై.ఎస్.ఎస్. కు మరియు పరమహంస యోగానందగారి బోధనలకు కొత్తవారైతే, క్రింద ఉన్న లింక్ లను అన్వేషించడానికి ఇష్టపడవచ్చు:

ఒక యోగి ఆత్మకథ

ఒక అత్యుత్తమ ఆధ్యాత్మిక రచనగా ప్రపంచవ్యాప్తంగా ప్రశంసించబడుతున్న తమ పుస్తకం గురించి పరమహంసగారు తరచుగా, “నేను లేనప్పుడు ఈ పుస్తకం నా దూత అవుతుంది,” అనే వారు.

వై.ఎస్.ఎస్. పాఠాలు

మీరు ఊహించని విధంగా మీ జీవితాన్ని మార్చడానికి, సమతుల్యతను సాధించటానికి మరియు విజయవంతమైన జీవితాన్ని గడపడానికి మీకు సహాయపడే గృహ-అధ్యయన పాఠ్యక్రమం.

ఇతరులతో పంచుకోండి