వై.ఎస్.ఎస్. యువజన శిబిరాలలో సత్సంగం, నిశ్చలత్వం, మరియు చిరునవ్వుల వేసవి

29 సెప్టెంబర్, 2025

వై.ఎస్.ఎస్. భక్తులు మరియు స్నేహితుల పిల్లలు, యువజనులు ఏప్రిల్, మే మరియు జూన్ నెలల్లో జరిగే వార్షిక బాలికల మరియు బాలుర వేసవి యువజన శిబిరాల్లో ఒక ఆహ్లాదకర సాంగత్యం కోసం సమావేశమయ్యారు. 7 నుండి 17 సంవత్సరాల వయస్సు గల పిల్లలు, యువజనులు ఒక వారంపాటు ధ్యానం, వినోద కార్యకలాపాలు ఇంకా శరీరం, మనస్సు మరియు ఆత్మను పెంపొందించే ప్రేరణలో నిమగ్నమయ్యేందుకు రాంచీ, నోయిడా మరియు చెన్నైలోని యోగదా సత్సంగ ఆశ్రమాలు వారిని ఆహ్వానించాయి.

గురుదేవులు పరమహంస యోగానందగారి జీవించడం ఎలా బోధనలపై ఆధారితమైన ఈ శిబిరాలు, యువతకు ఆధ్యాత్మిక విద్య యొక్క ఆదర్శాన్ని — ధ్యానం మరియు సరైన కార్యాచరణతో సమతుల్య జీవితాన్ని గడిపే సామర్థ్యాన్ని పిల్లలలో పెంపొందించడానికి ప్రోత్సహిస్తాయి. ఆశ్రమ శిబిరంలోని ప్రతి కార్యక్రమం వివిధ వయస్సుగల పిల్లలు మరియు యువకుల అవసరాలకు అనుగుణంగా ఆలోచనాత్మకంగా రూపొందించబడింది; ఇవి శక్తిపూరణ వ్యాయామాలు, సామూహిక ధ్యానాలు, సన్యాసుల నేతృత్వంలో సత్సంగాలు, ఇంకా కథ చెప్పడం, పోషకాహారం మరియు బహిరంగ క్రీడలను కూడి ఉంటాయి.

రాంచీ ఆశ్రమం:

పవిత్రమైన వై.ఎస్.ఎస్. రాంచీ ఆశ్రమ ప్రాంగణంలో 7 నుండి 12 సంవత్సరాల వయస్సుగల పిల్లలు మరియు 13 నుండి17 సంవత్సరాల వయస్సుగల యువజనులు ఏడు రోజుల యువజన శిబిరానికి హాజరయ్యారు. దైనందిన ఆధ్యాత్మిక దినచర్యలో శక్తిపూరణ వ్యాయామాలు మరియు ధ్యానం ఉండేవి; ఇవి భజనలు, సామూహిక గీతాలాపన మరియు కృష్ణ కథ — భగవాన్ శ్రీకృష్ణుని బాల్య వృత్తాంతాలను పునరావృతం చేయడం – వంటి భక్తి కార్యక్రమాలతో కలిసి ఉండేవి. ఇంకా హిమాలయాల్లోని నిజమైన బాబాజీ గుహ యొక్క శాంతియుత స్పందనలకు, పాల్గొనేవారిని మానసికంగా తీసుకొనిపోయేలా ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడి, “బాబాజీ గుహ” అని పిలువబడిన ఒక గుడారంలో ధ్యానాలు జరిగాయి.

జీవించడం ఎలా శిక్షణలో భాగంగా, పిల్లలకు సామాజిక మర్యాద, పూలదండల తయారీ, తోటపని మరియు వృత్తివిద్య వంటి విస్తృత సృజనాత్మక మరియు స్వీయ-వికాస కార్యకలాపాలు పరిచయం చేయబడ్డాయి. ఆలోచనాత్మక మరియు బాధ్యతాయుతమైన ప్రవర్తనను ప్రోత్సహించడానికి, వీరికి ప్రతిరోజూ “స్వీయ-నిర్దేశిత కార్యాచరణ” సమయం కేటాయించబడింది; వారు ఆ సమయంలో డైరీ వ్రాసుకోవడం, ఆత్మపరిశీలన మరియు ఆశ్రమం యొక్క నిర్దేశిత పర్యటన వంటి కార్యక్రమాలలో గడిపే అవకాశం ఉండేది. 

ఒక వినోద క్రీడ అనంతరం తమ ట్రోఫీని అందుకుంటున్న పిల్లలు
“బాబాజీ గుహ” లో ధ్యానం చేస్తున్న యువజనులు

ఈ చిరస్మరణీయమైన వారం “పల్లకీ” ఊరేగింపుతో ముగిసింది, వీరంతా ప్రేమతో వారంపాటు రూపొందించిన పల్లకీలపై గురువుల చిత్రపటాలను భక్తితో, భజనలతో ఊరేగించారు. ఆధ్యాత్మిక క్విజ్, నిధి వేట (ట్రెజర్ హంట్), గురుదేవుల ప్రారంభ జీవితంపై ఒక ప్రత్యేక డాక్యుమెంటరీ ప్రదర్శనలోకూడా వీరు పాల్గొన్నారు. చివరికి వీరంతా శిబిరం యొక్క ఫొటోల ప్రదర్శనతో గత వారపు స్మృతులను గుర్తు చేసుకున్నారు.

నోయిడా ఆశ్రమం:

వై.ఎస్.ఎస్. నోయిడా ఆశ్రమం, బాలికలు మరియు బాలుర కోసం మే మరియు జూన్ నెలల్లో రెండు వేర్వేరు వారాలలో శిబిరాలను నిర్వహించింది. హాజరైనవారందరినీ నాలుగు బృందాలుగా విభజించి, వీరందరినీ సుశిక్షితులైన బృంద నాయకుల ప్రేమపూర్వకమైన నిర్దేశంలో ఉంచడం జరిగింది. 

వై.ఎస్.ఎస్. సన్యాసి నేతృత్వంలో శక్తిపూరణ వ్యాయామాలతో రోజును ప్రారంభిస్తున్న బాలురు
సంకీర్తనతో కూడిన గురుకథను నిర్వహిస్తున్న ఒక వాలంటీర్

ఆశ్రమంలో శిబిరం యొక్క ఆధ్యాత్మిక దినచర్య ముఖ్యాంశాలలో ఒక భాగం, ఉదయాన్నే చేసే జప-నడకలు – ఇవి పిల్లలు సరైన రీతిలో ఆ రోజుకి సంసిద్ధమవడానికి దోహదపడేవి. దైనందిన కార్యక్రమాలలో గురుకథ మరియు సుందరకాండ కూడా వారి భక్తి వ్యక్తీకరణకు దోహదం చేశాయి. పరమహంస యోగానందగారి బోధనల ఆధారంగా జీవించడం ఎలా తరగతులతో పాటు, ఈ శిబిరంలో డిజిటల్ భద్రత మరియు అత్యవసర ప్రథమ చికిత్స వంటి జీవిత నైపుణ్యాలను పెంపొందించే కార్యక్రమాలు కూడా ఉన్నాయి. వారి ఆధ్యాత్మిక తృష్ణ చల్లార్చేందుకు సన్యాసులతో సంభాషించే అవకాశం కూడా చిన్నారులకు లభించింది.

చెన్నై ఆశ్రమం:

చెన్నైలో నూతనంగా ప్రారంభించిన వై.ఎస్.ఎస్. ఆశ్రమం, ఏప్రిల్ చివరి మరియు మే మొదటి వారాలలో బాలురు మరియు బాలికల కోసం రెండు వేర్వేరు వేసవి శిబిరాలను నిర్వహించింది. రెండు శిబిరాలు కూడా తల్లిదండ్రులు మరియు పిల్లలను ఆశ్రమ సన్యాసులు హృదయపూర్వకంగా స్వాగతించడంతో ప్రారంభమయ్యాయి. శిబిరం యొక్క కార్యక్రమం, “యువత కోసం ఆత్మ లక్షణాలు” అనే నేపధ్యం చుట్టూ, ప్రతిరోజూ కరుణ, వినయం, ఆనందం, ధైర్యం, జ్ఞానం మరియు భక్తి వంటి నిర్దిష్ట ఆత్మ లక్షణాలను పెంపొందింపచేసే విధంగా, ఆలోచనాత్మకంగా రూపొందించబడింది.

తమకు కృతజ్ఞత కలిగించిన విషయాలతో నింపిన – “కృతజ్ఞతా జాడీలు” పూజా వేదిక ముందు ఉంచిన బాలికలు.
కుండలపై చిత్రలేఖనం తరగతిలో నిమగ్నమైన బాలురు

ప్రతి రోజూ, ఆ రోజు యొక్క నేపథ్యాన్ని సంపూర్ణం చేయడానికి మరియు ఆధ్యాత్మిక గుణాలపై పిల్లలకు లోతైన అవగాహనను కల్పించడానికి, హస్తకళలు, యానిమేషన్ చిత్రాల ప్రదర్శనలు, క్రీడల వంటి ప్రాతిపదికలతో, ఈ కార్యకలాపాలు సాలోచనాత్మకపూర్వంగా రూపొందించబడ్డాయి. వంట మరియు విశ్రాంతిపై ప్రత్యేక కార్యక్రమములు, పిల్లలకు ఆరోగ్యం మరియు స్వస్థతల గురించి సమగ్ర అవగాహనను పెంపొందించడానికి దోహదపడ్డాయి.

యోగదా సత్సంగ ఆశ్రమాలలో నిర్వహించిన వేసవి శిబిరాలు, విద్య మరియు ఆధ్యాత్మికతల ఏకాంతవాసాలు మాత్రమే కాకుండా, పరమహంస యోగానందగారి విశ్వజనీన మరియు సనాతనమైన బోధనల ద్వారా, యువ మనస్సులు తమ అంతర్గత సామర్థ్యాన్ని తెలుసుకునే అవకాశాలు కూడా కలిగించాయి. ఈ జ్ఞాపకాలతో, స్ఫూర్తితో మరియు ఆచరణాత్మక జ్ఞాన ప్రేరణలతో పిల్లలు మరియు యువజనులు ఇంటికి తిరిగి వెళ్లినప్పుడు, చాలామంది గురుదేవులతో లోతైన అనుబంధాన్ని ఇంకా అంతర్గత జీవితాన్ని పెంపొందించుకునే సాధనాలను తోడ్కొని వెళ్ళారు.

యోగ్యతా ప్రమాణాలు:

తల్లిదండ్రులు మరియు పిల్లలు శిబిరంలోని తమ అనుభవాలను పంచుకున్నారు: 

పిల్లలు: 

తల్లిదండ్రులు: 

వేసవి శిబిరంలో పిల్లలు వ్రాసిన “గురుదేవులకు లేఖలు”

రాంచీ యువజన శిబిరం 2025లో భాగంగా, యువభక్తులు శ్రీ శ్రీ పరమహంస యోగానందగారికి వ్యక్తిగత లేఖలు వ్రాసి, ఆయన పట్ల తమ భక్తిని వ్యక్తీకరించడం నేర్చుకొన్నారు. ఈ క్రింద కొన్నిటిని పొందుపరిచాము:

నా ప్రియ గురుదేవా, 
… మీరు ఎలా ఉన్నారు? మీరు క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను. నేను ధ్యానంలో బాగా రాణించాలని, ఇతరులకు సహాయం చేయాలని, చదువులో బాగా రాణించాలని మరియు నా తల్లిదండ్రులకు కీర్తి తీసుకురావాలని నా కోరిక. నేను ఎల్లప్పుడూ మంచిని ఆలోచించాలనుకుంటున్నాను, మీరు ఎల్లప్పుడూ నాతోనే ఉన్నారని నాకు తెలుసు. జై గురు!

మీ భక్తుడు.
– ఎస్

ప్రియ గురుదేవా,
నేను ఇక్కడ సంతోషంగా ఉన్నాను. మీరు ఎలా ఉన్నారు? కొన్ని రోజుల క్రితం నేను మీకు డైరీ మిల్క్ చాక్లెట్ ఇచ్చాను. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నేను సైన్స్ శాఖను ఎంచుకున్నాను… నాకు చాలా ఉన్నతమైన ఆశలు ఉన్నాయి. మీ కళ్ళు చాలా అందంగా ఉంటాయి. నేను ప్రతిరోజూ ధ్యానం చేయను కానీ చేయడానికి ప్రయత్నిస్తాను.

ఆప్యాయతతో,
– ఎంకె

దివ్య గురుదేవా,
మీరు ఎలా ఉన్నారు? నేను ఇక్కడ బాగున్నాను. నేను మీతో మాట్లాడవలసిన చాలా ముఖ్యమైన విషయం ఒకటుంది. 
మీరు నా వద్దకు ఎప్పుడు వస్తారు? నాకు మీ దర్శనం ఎప్పుడు ఇస్తారు? క్రితంసారి నేను మిమ్మల్ని చూసినప్పుడు, నాకు కలిగిన ఆ ఆనందం గుర్తుంది… మీరు నా దగ్గరకు వచ్చి మీ దర్శనమిచ్చిన తర్వాత జీవితంలోని సవాళ్లు మాయమవుతాయని నాకు తెలుసు. అలాగే, నా సంకల్పశక్తి బలోపేతం అవ్వడానికి నాకు మీ ఆశీర్వాదాలు అవసరం. గురుదేవా, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని మీకు తెలుసా? మీకు తెలుసు. కదా? “మీరు నా ఏకైక ప్రేమగా మారే వరకు నేను మిమ్మల్నే ప్రేమించేలా నాకు సహాయం చేయండి”.

మీ ప్రియమైన కుమార్తె,
– డి

గురుదేవా, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. నన్ను ఈ ఆశ్రమ శిబిరంలోకి తీసుకువచ్చినందుకు మీకు నా ధన్యవాదాలు. ఇక్కడ చాలా సరదాగా ఉంది. గత సంవత్సరం నుండి నేను ఇక్కడికి రావడానికై వేచి ఉన్నాను. నేను చాలా సంతోషంగా ఉన్నాను. ధన్యవాదాలు. గురుదేవా, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. 

– కె 

ప్రియమైన గురుదేవా, 
మీరు నా కోరికను వినడానికి అందుబాటుగా ఉన్నారని ఆశిస్తున్నాను. మీ ఉపదేశాలతో నా జీవిత మార్గనిర్దేశం చేయాలని నేను కోరుకుంటున్నాను అని చెప్పడానికి ఇది వ్రాస్తున్నాను. అంతే కాదు నాకు ఇంకో కోరిక ఉంది. మీ లిచీ చెట్టు నుండి కొన్ని లిచీలు నాకు కావాలి. 

ప్రేమతో, 
– ఎవి

ఇతరులతో పంచుకోండి