
చాలా సంవత్సరాల తరువాత కూడా, పరమహంస యోగానందగారి జీవిత వృత్తాంతం, ఒక యోగి ఆత్మకథ భారతదేశపు సనాతన యోగాధ్యాన బోధనలను లక్షలాదిమందికి పరిచయం చేస్తూ సేవలందిస్తూనే ఉంది. భారతీయ సితార్ విద్వాంసుడు, దివంగత రవిశంకర్; దివంగత యాపిల్ సి.ఈ.ఒ. స్టీవ్ జాబ్స్; భారత క్రికెటర్ విరాట్ కోహ్లి వంటి విభిన్న రంగాలకు చెందిన అనేకమంది ప్రముఖ వ్యక్తులచే సిఫార్సు చేయబడి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పాఠకులకు స్ఫూర్తినిస్తూనే ఉంది. యాభైకి పైగా భాషలలో ముద్రించబడి, “20వ శతాబ్దపు 100 అత్యుత్తమ ఆధ్యాత్మిక పుస్తకాలలో” ఒకటిగా గుర్తింపు పొందింది.
ఉచిత ఈ-పుస్తకం డౌన్లోడ్ చేసుకోండి
(భారతదేశం, నేపాల్, మరియు శ్రీలంకలో — జూన్ 22, 2025 వరకు మాత్రమే ఈ సదుపాయం అందుబాటులో ఉంటుంది)
మీ వివరాలు అందించండి
భారతదేశం, నేపాల్ మరియు శ్రీలంకలో మాత్రమే ఈ ఉచిత ఈ-పుస్తకం డౌన్లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంటుందని దయచేసి గమనించండి.

యోగ్యతా పత్రాలు
ఈ పుస్తకాన్ని నేను ఎంతగానో ఇష్టపడతాను. తమ ఆలోచనలు మరియు భావజాలాలను సవాలు చేసేందుకు వీలు కల్పించే వారందరూ తప్పకుండా దీన్ని చదవాలి. ఈ పుస్తకంలోని జ్ఞానాన్ని అవగాహన చేసుకొని ఆచరిస్తే మీ సమస్త జీవితం మరియు దృక్పథం మారిపోతుంది. దైవాన్ని విశ్వసించి, సత్కర్మలు చేస్తూ ముందుకు సాగండి 😇#onelove #begrateful #helponeanother
“ఆధునిక హిందూ సాధువుల అసాధారణ జీవితాలకు మరియు శక్తులకు ప్రత్యక్ష సాక్షిగా, ఈ పుస్తకానికి సమయానుకూలమైన మరియు కాలానుగుణమైన ప్రాముఖ్యత ఉంది.... పశ్చిమంలో ప్రచురించబడిన ఆయన అసాధారణ జీవితం, ఖచ్చితంగా భారతదేశ ఆధ్యాత్మిక సంపదను ఎక్కువగా వెల్లడిచేసిన వాటిలో ఒకటిగా నిలుస్తుంది.”
“అతి మనోహరంగాను మరియు సాధారణంగాను చెప్పిన ఆత్మకథల్లో ఇది ఒకటి...నేర్చుకొనేవారికి నిజమైన జ్ఞానభాండాగారం...ఈ పేజీల్లో మనం కలుసుకొనే వ్యక్తులు గొప్ప ఆధ్యాత్మిక జ్ఞానంతో నిండిన ఆప్తమిత్రుల్లా మనకు తరచు జ్ఞాపకం వస్తూ ఉంటారు; అలాంటి మహానుభావుల్లో దైవోన్మత్తులైన ఈ గ్రంథకర్త కూడా ఒకరు.”
“ప్రఖ్యాతి గాంచిన (యోగానందగారి) ఒక యోగి ఆత్మకథలో, యోగసాధనలో ఉన్నతస్తరాల్లో సాధకుడు పొందే ‘విశ్వచేతనానుభవాన్ని’ మనం నిర్ఘాంతపోయే మాటల్లో వర్ణించారు; మానవ స్వభావంలోని వివిధ ఆసక్తికరమైన అంశాలమీద యోగపరమైన, వేదాంతపరమైన దృష్టికోణం నుంచి అనేక వ్యాఖ్యానాలు చేశారు.”